విక్రమ్ టార్గెట్ తో ఇండియన్ 2..?

కొన్నాళ్లుగా అసలేమాత్రం ఫాంలో లేని కమల్ హాసన్ ఖాతాలో విక్రం తో సెన్సేషనల్ హిట్ పడేలా చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కమల్ కెరీర్ కు విక్రం హిట్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా 400 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి కమల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ 2 తో కూడా కమల్ హాసన్ మళ్లీ అదే టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

ఇండియన్ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెబుతున్నారు. అయితే బిజినెస్ పరంగా కమల్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఇండియన్ 2 బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. శంకర్ కూడా సూపర్ హిట్ కోసం ఈగర్ గా ఉన్నాడు కాబట్టి ఇండియన్ 2 కచ్చితంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుందని అంటున్నారు.

అయితే విక్రం రేంజ్ లో 400 కోట్లు సాధ్యమయ్యే పనేనా అంటే.. శంకర్ సినిమా హిట్ టాక్ వస్తే అదేమంత పని కాదు. కమల్ హాసన్ కూడా సక్సెస్ ఫాం లో ఉన్నాడు కాబట్టి ఇండియన్ 2 తో మరోసారి విక్రం రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇండియన్ 2 కథ, కథనాలు అన్ని పర్ఫెక్ట్ మీటర్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. అందుకే మేకర్స్ సినిమా రిజల్ట్ మీద అంత నమ్మకంగా ఉన్నారు. మరి ఇండియన్ 2 నిజంగానే విక్రం కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. కమల్ శంకర్ ఇద్దరు ఇండియన్ 2 సినిమా విషయంలో వారి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. అందుకే సినిమా ఫలితం కూడా అదే రేంజ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వస్తుందని భావిస్తున్నారు.

 


Recent Random Post: