గీతా గోవిందం హీరో డైరెక్టర్ విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణం లో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా తర్వాత పరశురాం సినిమానే సెట్స్ మీద కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే ని ఫైనల్ చేసినట్టు టాక్. ఇంకా అఫీషియల్ గా అయితే చెప్పలేదు. కానీ పూజా హెగ్దే అనగానే రౌడీ ఫ్యాన్స్ పూజా ఎందుకు రష్మిక ఉందిగా అనేస్తున్నారు.
విజయ్ దేవరకొండ రష్మిక ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ అందరికీ తెలిసిందే. గీతా గోవిందం తో హిట్ పెయిర్ గా అనిపించుకున్న ఈ జోడీ డియర్ కామ్రేడ్ సినిమా లో కూడా కలిసి నటించారు. అయితే ఆ సినిమా రిజల్ట్ నిరాశ పరిచింది.
డియర్ కామ్రేడ్ కూడా హిట్ అయితే విజయ్ రష్మిక సినిమాలు మళ్లీ మళ్లీ వచ్చేవి. అయితే గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం విజయ్ తో చేస్తున్న సినిమా లో పూజా హెగ్దే కన్నా రష్మిక హీరోయిన్ గా తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. విజయ్ రష్మిక కలిసి నటిస్తే చూడాలని రౌడీ ఫ్యాన్స్ కోరుతున్నారు.
కానీ కథ కు ఏ హీరో అవసరం అన్నది దర్శకుల ఛాయిస్. విజయ్ కూడా పరశురాం నిర్ణయానికి అడ్డు చెప్పలేదని తెలుస్తుంది. పూజా హెగ్దే కూడా విజయ్ తో నటించడానికి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది. యంగ్ హీరోల్లో డిఫరెంట్ స్టార్ డం తో దూసుకెళ్తున్న విజయ్ తో రొమాన్స్ అంటే పూజా హెగ్దే కూడా రెడీ అనేస్తుంది. విజయ్ సినిమా లో లిప్ లాక్ సీన్స్ కామన్ ఈ సినిమా లో పూజా ని కూడా విజయ్ లిప్ లాక్ చేస్తాడా లేదా అన్న డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి.
ఇక రష్మిక విషయానికి వస్తే బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసిన అమ్మడు తిరిగి మళ్లీ తెలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా చేస్తున్న రష్మిక ఆ సినిమా తర్వాత మరో స్టార్ సినిమా చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది.
పరశురాం సినిమా లో ఏమాత్రం ఛాన్స్ ఉన్నా రష్మికని తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. విజయ్ తో జత కట్టే హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా తో పాటు గా విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు.