దర్శకుడు శివ నిర్వాణ రూపొందించే సినిమాలన్నీ కూడా చాలా విభిన్నంగా.. డీసెంట్ లవ్ స్టోరీతో ఉంటాయి. మజిలీ.. నిన్ను కోరి సినిమాలు ఎంతటి డీసెంట్ లవ్ స్టోరీస్ తో రూపొందాయో అందరికి తెల్సిందే. ఇలాంటి లవ్ స్టోరీస్ తో కూడా సినిమాలు చేయవచ్చా అని ఆశ్చర్యపోయే విధంగా శివ నిర్వాణ సినిమాలు ఉంటాయి.
బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న శివ నిర్వాణ ప్రస్తుతం ఖుషి సినిమాను రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయ్యి విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఆలస్యం అయింది.
ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభం అయిన ఖుషి సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో సమంత చెల్లి పాత్రలో దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో కనిపించబోతుందట. గతంలో ఈమె మజిలీ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో దివ్యాంశ పాత్ర పరిమితంగా ఉంటుంది. కానీ ఖుషి లో కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
ఆలుమగలు అయిన విజయ్ దేవరకొండ.. సమంత మధ్య దివ్యాంశ కౌశిక్ ఎంట్రీతో జరిగేది ఏంటి అనేది సినిమా కథ అన్నట్లు గా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ఈ సినిమాలో సాగుతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండతో దివ్యాంశ కౌశిక్ యొక్క కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మజిలీ సినిమాలో ఒక హీరోయిన్ అదనంగా ఉండగా.. నిన్ను కోరి సినిమాలో ఒక హీరో అదనంగా ఉన్నాడు. ఇప్పుడు ఖుషి సినిమాలో ఒక హీరోయిన్ ను అదనంగా శివ నిర్వాణ నటింపజేస్తున్నాడు. కనుక ఈ సినిమా కూడా సర్ ప్రైజ్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.