ఈ మధ్య కాలంలో సెలబ్రెటీ కపుల్ విడాకుల గురించి తెగ వార్తలు వింటూ ఉన్నాం. బాలీవుడ్ కు చెందిన స్టార్ కపుల్ మొదలుకుని టాలీవుడ్.. కోలీవుడ్ కపుల్ వరకు ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. మరి కొందరు విడాకులకు రెడీ అవుతున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొత్తగా బాలీవుడ్ స్టార్ నటుడు ఫర్దీన్ ఖాన్ విడాకులకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ తనయుడు అయిన ఫర్దీన్ ఖాన్ 2005 సంవత్సరం లో లెజెండ్రీ హీరోయిన్ ముంతాజ్ కూతురు నటాషా మాధ్వాని ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
18 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగినా ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండే పరిస్థితి లేకపోవడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వీరి విడాకుల గురించి క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అంతే కాకుండా జాతీయ మీడియాలో కూడా వీరి విడాకుల గురించి కథనాలు వస్తున్నాయి. విడాకుల పుకార్లు నిజం కాకుంటే కచ్చితంగా ఇప్పటి వరకు స్పందించేవారు.
కానీ ఇప్పటి వరకు స్పందించలేదు కనుక విడాకుల వార్తలు నిజమే అయి ఉంటాయి. త్వరలోనే అధికారికంగా వీరి విడాకుల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.