కేజీఎఫ్ సినిమా లో రాఖీ భాయ్ కనిపించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.
కేజీఎఫ్ 2 విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు యశ్ తదుపరి సినిమా పట్టాలెక్కలేదు. అసలు ఆయన ఏ కథకైనా ఓకే చెప్పాడా అంటే అది కూడా లేదు అనే సమాధానం వినిపిస్తుంది.
ప్రస్తుతానికి కేజీఎఫ్ 2 హ్యాంగోవర్ లోనే యశ్ ఉన్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ యశ్ తదుపరి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు.
యశ్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్న క్యూట్ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా తన కూతురు తో ఆడుకుంటున్న ఈ క్యూట్ వీడియోను షేర్ చేసిన యశ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పిల్లలతో సమయం గడుపుతున్న యశ్ సినిమాలు చేసేది ఎప్పుడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
కేజీఎఫ్ 2 సినిమాను చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ యశ్ మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాలకు కమిట్ అవ్వకుండా పిల్లలతో టైమ్ పాస్ చేస్తున్నాడు అంటూ కొందరు అభిమానులు సున్నితంగా విమర్శిస్తున్నారు.