నేడు ఉదయం నుండి కూడా సోషల్ మీడియాలో తమిళ సినీ నటి మహా లక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తమిళ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ను వివాహం చేసుకుంది. సాదారణంగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారు పెళ్లి చేసుకోవడం.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడం చాలా కామన్ విషయం. కానీ ఈ పోటోలు అంతకు మించి అన్నట్లుగా ట్రెండ్ అవుతున్నాయి.
వీరి ఇద్దరి ప్రేమ వివాహం కు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు హాజరు అవ్వగా ఇరు వైపుల బంధు మిత్రులు హాజరు అయ్యారు. పెళ్లి వైభవంగా జరిగినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెళ్లి ఎలా జరిగింది అనే విషయాన్ని జనాలు పట్టించుకోవడం లేదు కానీ ‘ఆ’ విషయాన్ని మాత్రం చాలా సాగ తీస్తూ చర్చించుకుంటున్నారు.
తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన మహాలక్ష్మి ఇన్ స్టా లో… నిన్ను పెళ్లి చేసుకోవడం నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను. నీ ప్రేమతో నా జీవితంను సంపూర్ణం చేశావు.
నిన్ను భర్తగా పొందడం సంతోషంగా ఉంది. లవ్ యూ అమ్మూ అంటూ రాసుకొచ్చింది. రవీందర్ చంద్ర శేఖరన్ కూడా పెళ్లి ఫోటోలను షేర్ చేసి తన ఆనందంను తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.