మొదట పాన్ ఇండియా అనే పదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ తీసుకు వచ్చిన దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని నిరూపించాడు. మొదటి సినిమా జెంటిల్మెన్ నుంచి మొన్న వచ్చిన 2.0 వరకు కూడా శంకర్ సినిమా తీస్తే మిగతా భాషల్లో కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తూ వస్తున్నాయి. అయితే రోబో తర్వాత మాత్రం శంకర్ సరైన సక్సెస్ అందుకోలేదు.
నిజానికి ఆ సినిమా నుంచి అతనికి బ్యాడ్ టైం కాస్త ఎక్కువగానే నడుస్తోంది. అయితే రోబో రిజల్ట్ మంచి బూస్ట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మేకింగ్ నుంచే టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా 2.0 సినిమా ప్రొడక్షన్ దశలోనే శంకర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక తర్వాత ఇండియన్ 2 సినిమానైనా ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి హైప్ తో తీసుకురావాలని అనుకున్నాడు.
కానీ షూటింగ్ లో ప్రమాదం జరగడం ఆ తర్వాత కరోనా రావడం అనంతరం లైక ప్రొడక్షన్ నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో సినిమా దాదాపు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి శంకర్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి గేమ్ చేంజర్ మొదలుపెట్టాడు. అదైనా సక్రమంగా కొనసాగుతుంది అంటే నిర్మాత దిల్ రాజు కూడా శంకర బ్యాడ్ టైమ్ తో ఇబ్బంది పడ్డారు.
శంకర్ పరిస్థితిలు ఎవరికి న్యాయం చేయలేని విధంగా మారిపోయాయి. హఠాత్తుగా ఇండియన్ 2 సినిమా మొదలుపెట్టడంతో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఇక మొత్తానికి షూటింగ్ త్వరగానే పూర్తయినప్పటికీ కూడా మళ్లీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయం అలాగే అప్డేట్స్ విషయంలో మరింత టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఇండియన్ 2 సినిమాను జూన్ లో విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ అప్పుడే కల్కి సినిమా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ ఉన్నాడు కాబట్టి భారతీయుడు 2ని అదే టైమ్ లో దింపడం కూడా సరికాదు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందుగా ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది.
దిల్ రాజు అయితే గేమ్ ఛేంజర్ ను అక్టోబర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండగా నిర్మాత దిల్ రాజు పూర్తి బారాన్ని శంకర్ పైన వదిలేసాడు. ఏది ఏమైనా సినిమాల ప్రమోషన్స్, బజ్, ఫలితం కంటే కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ టెన్షన్ చాలా భారంగా మారిపోయింది. ముందు అదొక్క విషయంలో క్లారిటీగా వీలైనంత త్వరగా ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఈ విషయంలో దర్శకుడు శంకర్ ఒక ప్రణాళిక రచించుకుంటేనే బెటర్ లేదంటే నిర్మాతలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.