కంగనా రనౌత్ చెంప దెబ్బ చాలా పరిణామాలకు దారి తీసింది. విమానాశ్రయంలో లేడీ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టడాన్ని చాలా మంది ఖండిస్తే, బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ మాత్రం లేడీ కానిస్టేబుల్ చేసిన పనిని సమర్థించాడు. రైతులకు వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడినందున కంగనకు ఆ చెంప దెబ్బ సరిపోతుందనే అర్థంలో విశాల్ లేడీ కానిస్టేబుల్ ని సమర్థించారు.
దీనికి ఇప్పుడు కంగన కౌంటర్ వేసింది. ఎక్స్ ఖాతాలో శనివారం ఉదయం స్లాప్ సంఘటనను సమర్ధిస్తున్న వారిపై ఘాటైన నోట్ రాసింది క్వీన్. అలాంటి వ్యక్తుల `నేరపూరిత ధోరణులను` క్వీన్ ప్రశ్నించింది. ఎవరైనా అత్యాచారం లేదా హత్యకు గురైనట్లయితే ఇలానే సమర్థిస్తారా? అని దద్లానీని ప్రశ్నించింది. ప్రతి రేపిస్ట్, హంతకుడు లేదా దొంగ ఎల్లప్పుడూ నేరం చేయడానికి బలమైన భావోద్వేగ, శారీరక, మానసిక లేదా ఆర్థిక కారణాలను కలిగి ఉంటాడు. కారణం లేకుండా ఏ నేరమూ జరగదు. అయినప్పటికీ వారు దోషులుగా నిరూపణ అయ్యాక జైలు శిక్షను అనుభవిస్తారు. మీరు నేరస్థులతో కలిసి ఉంటే భూమిపై అన్ని చట్టాలను ఉల్లంఘించే నేరానికి శిక్ష తప్పనిసరి. ఒకరి ఇంటిమేట్ జోన్లోకి ప్రవేశించడం, వారి అనుమతి లేకుండా వారి శరీరాలను తాకడం .. వారిపై దాడి చేయడం.. మీకు బాగానే ఉంటే గుర్తుంచుకోండి. ఆపై మీరు అత్యాచారం లేదా హత్యతో సరిపెట్టుకుంటారు. ఎందుకంటే అది కూడా చొచ్చుకుపోవడం లేదా కత్తితో పొడిచివేయడం మాత్రమే. మీరు లోతుగా పరిశీలించాలి. మీ మానసిక పరిస్థితిని, నేరపూరిత ధోరణుల గురించి తెలుసుకోండి“ అని కంగనా ఘాటైన లేఖ రాసింది. దయచేసి యోగా ధ్యానం చేయమని సూచిస్తున్నాను. లేకపోతే జీవితం ఒక చేదైన భారమైన అనుభవంగా మారుతుంది. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. దయచేసి ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోండి! అని కంగన సదరు సంగీత దర్శకుడికి సూచించింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సంగీత స్వరకర్త విశాల్ దద్లానీ కంగనాను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌కు మద్దతిచ్చి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత కంగనా రనౌత్ దీనికి స్పందించింది. “నేను హింసను ఎప్పుడూ సమర్ధించను.. కానీ ఈ కోపం అవసరాన్ని అర్థం చేసుకున్నాను. CISF ఆమెపై ఏదైనా చర్య తీసుకున్నట్లయితే.. ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధమైతే.. తన కోసం ఉద్యోగం ఇవ్వగలనని నేను నిర్ధారిస్తున్నాను. జై హింద్. జై జవాన్. జై కిసాన్! అని దద్లానీ రాశారు.
కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ జూన్ 6న న్యూఢిల్లీకి వెళుతుండగా చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో విధుల్లో ఉన్న మహిళా CISF కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా పంజాబ్ మహిళలపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కుల్విందర్ కౌర్ అనే మహిళా CISF సిబ్బంది అసంతృప్తి చెందారు. డబ్బు కోసం రైతులు నిరసనలో పాల్గొన్నారని వ్యాఖ్యానించినందున కుల్విందర్ చెంప దొబ్బ కొట్టినట్టు తెలిపింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు.
తరువాత కంగనా సంఘటన గురించి మాట్లాడటానికి ఒక వీడియో ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌లో ఉగ్రవాదం గురించి ప్రశ్నించింది. నాకు మీడియా నుండి శ్రేయోభిలాషుల నుండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను సురక్షితంగా ఉన్నాను.. నేను పూర్తిగా బాగున్నాను. ఈరోజు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన తనిఖీలు ముగించుకుని వెళుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది నా ముఖంపై కొట్టారు. ఆమె నన్ను దుర్భాషలాడింది. ఎందుకు అలా చేశావని నేను ఆమెను అడిగినప్పుడు రైతుల నిరసనలకు తాను(ఆమె) మద్దతిస్తున్నానని చెప్పింది. నేను క్షేమంగా ఉన్నాను కానీ నా ఆందోళన ఏమిటంటే, పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనేదే ఆందోళనగా ఉంది! అని కంగన చెప్పింది.
ఇప్పటివరకు, అనుపమ్ ఖేర్, షబానా అజ్మీ, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్, ఉర్ఫీ జావేద్, దేవోలీనా భట్టాచార్జీ సహా పలువురు నటీనటులు దురదృష్టకర సంఘటనను ఖండిస్తూ కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచారు.