సమంతని బాగా బయపెట్టేది ఇదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సామ్ కి దక్షిణాదిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో ఉత్తరాదిన కూడా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ఖుషీ విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంగతి పక్కన పెడితే, సమంత కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితం వరకు చాలా మందికి చాలా విషయాలు తెలుసు. అయితే, ఆమెను విపరీతంగా భయపెట్టే ఒక విషయం ఉందట. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టని సామ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె చెప్పడం విశేషం.

నిజానికి సమంత తన జీవితంలో చాలా చూసింది. ఆమె చాలా ధైర్యవంతురాలు అని అందరూ అనుకుంటారు. కానీ, ఆమెకు లిఫ్ట్ లంటే భయమట. ఈ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించింది. ఎలివేటర్ లో వెళ్లడానికి తనకు చాలా భయమని, ముఖ్యంగా రద్దీ గా ఉండే ప్రాంతంలో ఎలివేరట్ ఎక్కాలంటే భయం అని ఆమె చెప్పారు.

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. గత కొంతకాలంగా సమంత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారు. అమెరికాలో చికిత్స తీసుకోవడానికి ఆమె సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చికిత్స మొత్తం పూర్తైన తర్వాతే, ఆమె మళ్లీ ఇండియా రానున్నారు.

అమెరికా వెళ్లడానికి ముందు ఆమె తన ఖుషీ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. మ్యూజిక్ కన్సర్ట్ లో డ్యాన్సులు కూడా వేసి సందడి చేసింది. ఇక, ఈ సినిమాలో సమంత ఆరాధ్య అనే పాత్రలో కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇది కాకుండా, సమంత సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లోనూ నటించింది.