సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్న విషయం తెల్సిందే. సమంత అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈనెల లేదా వచ్చే నెల నుండి సమంత షూటింగ్స్ కు హాజరు అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా సమంత యొక్క ఆరోగ్య పరిస్థితిపై మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత తనకు ఆదర్శం అని.. జీవితంలో ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్న వైనం చాలా మందికి ఆదర్శనీయం అన్నట్లుగా రష్మిక మందన్నా పేర్కొంది.
ఇంకా రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం సమంత ఎదుర్కొంటున్న అనారోగ్యం గురించి అందరితో పాటు నాకు ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పినప్పుడే తెలిసింది.
ఆ సమయంలో సమంత కు అమ్మగా మారి కాపాడుకోవాలని ఉంది.. ప్రస్తుతం ఆమెకు వెన్నంటి ఉండాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో సమంత అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆమె అంటే చాలా గౌరవం అని కూడా రష్మిక పేర్కొంది. తాను ఇష్టపడే వారికి మంచి జరగాలని కోరుకుంటాను అని.. అలాగే వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాలని కోరుకుంటాను అన్నట్లుగా రష్మిక అంది.
రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా త్వరలో విజయ్ దేవరకొండ సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం వారసుడు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.