సమంత కోసం ఇంకాస్త జాగ్రత్త పడుతుందా..!

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ బి వి నందిని రెడ్డి రీసెంట్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాతో మరోసారి షాక్ ఇచ్చింది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. నందిని రెడ్డి ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా కూడా వృధా అయ్యింది. సంతోష్ శోభన్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ చేరింది. మాళవిక నాయర్ ఎంత మంచి పర్ఫార్మర్ అయినా ఆమె బ్యాడ్ లక్ కొనసాగుతుంది. ఫైనల్ గా అన్నీ మంచి శకునములే సినిమా భారీ లాస్ తెచ్చిపెట్టింది.

2019లో వచ్చిన ఓ బేబీ సినిమాతో నందిని రెడ్డి హిట్ అందుకోగా నాలుగేళ్ల తర్వాత తీసిన అన్నీ మంచి శకునములే మాత్రం నిరాశ పరచింది. సినిమాలన్న తర్వాత హిట్లు ఫ్లాపులు కామనే. ఇదిలా ఉంటే నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ సమంత లీడ్ రోల్ లో రాబోతున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే అనీ మంచి శకునములే ఇచ్చిన షాక్ వల్ల నందిని రెడ్డి సమంత సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

సమంత తో ఆల్రెడీ జబర్దస్త్ ఓ బేబీ రెండు సినిమాలు చేయగా అందులో జబర్దస్త్ ఫ్లాప్ అయినా ఓ బేబీ సినిమా హిట్ అయ్యింది. సినిమాల కన్నా నందిని రెడ్డి సమంతల ఫ్రెండ్ షిప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. శాకుంతలంతో కూడా సమంత ప్రేక్షకులను నిరాశపరచింది. ఆ సినిమా ఫెయిల్యూర్ ఊహించలేని సమంత మరోసారి కెరీర్ డైలమాలో పడేలా చేసుకుంది. విజయ్ తో చేస్తున్న ఖుషి సినిమా ఎంత సక్సెస్ అయినా అది రౌడీ హీరో ఖాతాలోకే వెళ్తుంది. అందుకే నందిని రెడ్డి సినిమా పై స్పెషల్ ఫోకస్ చేస్తుంది సమంత.

నందిని రెడ్డి కూడా ఈసారి హిట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయిన సిద్ధు సమంతతో జత కట్టడం విశేషం.

యువ హీరో తో సమంత ఈ వెరైటీ కాంబో ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాకు టైటిల్ కూడా చాలా వెరైటీ గా ఉండబోతుందని చెబుతున్నారు.