స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు విదేశాల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన సమంత ప్రస్తుతం చెన్నైలో ఉంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న సమంత సినీ ప్రమోషనల్ వేడుకలకు హాజరు కాకపోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ తో సమంత నటించిన ‘ఖుషి’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత కనిపించలేదు. షూటింగ్ ను ఏదోలా పూర్తి చేసిన సమంత ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు నో చెప్పిందనే సమాచారం అందుతోంది. ఖుషి ట్రైలర్ లాంచ్ విడుదల కార్యక్రమంలో సమంత లేకపోవడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు.
సమంత పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సమంత సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్విట్టర్ లో సమంత… ఈ ప్రపంచం కోసం మీరు జీవించాల్సిన అవసరం లేదు. మీ స్థాయిని, మీ గౌరవాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం మిమ్ములను గుర్తించకున్నా పట్టించుకోవద్దు.
ఇతరుల కోసం కాకుండా మీ కోసం మీరు జీవించండి. పది మందిలో ఒకరిగా కాకుండా మీ జీవితం కోసం మీరు హీరోలుగా పోరాడాలి, మీ జీవితం కోసం మీరు నిలవాల్సిన సమయం ఇది అంటూ ట్వీట్ లో పేర్కొంది. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అయింది. ఇంతకు సమంత ఈ జీవిత పాఠం ఎవరికి చెప్పినట్టు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఖుషి ట్రైలర్ లాంచ్ కు సమంత హాజరు కాకపోవడం పట్ల సమంత పై కొందరు ట్రోల్స్ చేశారు. ఆ కారణంగా సమంత ట్విట్టర్ లో ఇలా స్పందించి ఉంటుందా లేదంటే మరెవ్వరినైనా సమంత తన ట్వీట్ ద్వారా పేరు ప్రస్తావించకుండా టార్గెట్ చేసిందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.