సమంత నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరోగసి నేపథ్యంలో రూపొందిన యశోద సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యశోద సినిమాలో సమంత సరోగసి మదర్ గా నటించిన విషయం తెల్సిందే. సరోగసి పేరుతో జరిగే ఒక మాఫియా గుట్టు రట్టు చేసే కథతో యశోద రూపొందింది.
సరోగసి మరియు ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ కాన్సెప్ట్ లు ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళంలో కూడా వరుసగా వస్తున్నాయి. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా కూడా సరోగసి నేపథ్యంలోనే అంటూ సమాచారం అందుతోంది.
మహేష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించబోతుండగా జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. హీరోగా నవీన్ పొలిశెట్టి లుక్ ను తాజాగా రివీల్ చేయడం జరిగింది.
షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి ల మధ్య సినిమాలో ఉండే సంబంధం ఏంటీ.. అసలు వీరిద్దరితో సరోగసి కాన్సెప్ట్ తో ఎలాంటి సినిమా తీసి ఉంటారో చూడాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
అనుష్క 48వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క తన వయసుకు తగ్గ పాత్రను చేస్తుందని కూడా సమాచారం అందుతోంది. ఆమె అభిమానులు సర్ ప్రైజ్ అయ్యే విధంగా పాత్ర ఉంటుందని యూవీ క్రియేషన్స్ వారు అంటున్నారు.