సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాకి ఇది హిందీ రీమేక్ అనే ప్రచారం ఉంది. కానీ నిజానికి కాటమరాయుడు సినిమానే తమిళ సినిమా ‘వీరమ్’కు తెలుగు రీమేక్. ఇప్పుడు అదే సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు.
ఫర్హాద్ సమీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో కనిపించడం… తమిళ హీరోలు… తెలుగు సినిమాల్లో కనిపించడం ఇలా భాషకు సంబంధం లేకుండా ఏ హీరోలు ఇతర హీరోల సినిమాల్లో అతిధి పాత్రలో నటించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు.
సల్మాన్ ఖాన్ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన ముఖ్య అనుచరుడి పాత్రలో కనిపించాడు. గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అయిన సమయంలో రామ్ చరణ్ కూడా తన రుణం తీర్చుకుంటానంటూ అప్పట్లో సల్మాన్ ఖాన్ కు మాటిచ్చాడు. ఈ తరుణంలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డే సహా రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తేజ క్రేజ్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.
అలాంటి రామ్ చరణ్ క్రేజ్ తనకి కూడా కలిసి వస్తుందని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయ్ అనేది కాలమే నిర్ణయించాలి మరి.