సమంత నాగచైతన్య భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ వారికి సంబంధించిన అనేక రకాల విషయాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అలాంటి వార్తలు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు ఇద్దరు పెద్దగా రియాక్ట్ అయితే కావడం లేదు. కానీ అప్పుడప్పుడు ఊహించని కొన్ని కొటేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వివిధ రకాల అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి.
ఇక సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఒక్కసారి కూడా ఎదురుపడలేదు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ ఒక వేడుకలో ఎదురుపడే పరిస్థితి రాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి సెలబ్రెటీలు ఇటలీ బయలుదేరారు. ఎందుకంటే మెగా హీరో వరుణ్ తేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇటలీలో ఇప్పటికే కాక్ టెల్ పార్టీతో వేరే పెళ్లి వేడుక హడావిడి మొదలైపోయింది. ఇక మెహేంది కి సంబంధించిన ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది. అయితే బుధవారం రోజు మాత్రం పెళ్లి వేడుక జరగబోతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం లావణ్య త్రిపాఠి నాగచైతన్య ఒకటి కాబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ హీరోలు అలాగే హీరోయిన్స్ కూడా పాల్గొంటున్నారు.
అందులో నాగచైతన్య సమంత కూడా అతిధులుగా పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ వేడుకలో ఏదో ఒక సందర్భంలో నాగ చైతన్య సమంత ఎదురుపడే పరిస్థితి రాకుండా ఉంటుందా? ఇక అప్పుడు వాళ్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూసిన వారికే తెలియాలి. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటికీ కూడా చాలా ఫ్రెండ్లీ గానే ఉన్నట్లు చాలా సార్లు కొన్ని కామెంట్స్ వినిపించాయి.
ముఖ్యంగా చై అయితే సమంత మంచి కోరుకునే మాజీ భర్తగా ఒక స్నేహితుడిగా ఉంటాను అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనపటికి ఇప్పుడు పెళ్లిలో గ్రూప్ ఫోటో దిగాల్సి వస్తే ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదా అనేది కూడా హాట్ టాపిక్ మారిపోయింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక రేపు జరిగిన తర్వాత మెగా అగ్ర హీరోలు అందరూ కూడా మళ్లీ వెంటనే ఇండియాకు తిరిగి రాబోతున్నారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే.