సాయి పల్లవి తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అయింది. శ్యామ్ సింగ రాయ్ సినిమా తర్వాత ఆమె చేసిన తెలుగు సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.. అయితే ఆమె సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.
అదేమిటంటే ఇప్పుడు భారీ బడ్జెట్ తో రామాయణం అనే ఒక ప్రాజెక్టు రాబోతోంది దాదాపు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ తో దేశంలోని అన్ని ప్రముఖ భాషలోకి చెందిన నటీ నటులను భాగం చేసి ఈ సినిమా చేస్తామని గతంలోనే అల్లు అరవింద్ ప్రకటించారు.
బాలీవుడ్ టాలీవుడ్ టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీ నటులు ఈ రామాయణంలో కీలకపాత్రలో పోషించబోతున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా రెండేళ్ల పాటు ఇతర సినిమాలకు దూరంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
ఏమైనా రామాయణం ప్రాజెక్టు కోసమే రెండేళ్లు పాటు వర్క్ చేయాలని నిర్ణయం తీసుకుందట. అయితే ఇది ప్రచారమే కాగా ఒక నెల నిజంగానే ఆమె నిర్ణయం కనుక తీసుకుంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నట్లయితే అనే ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే ఇప్పటికే శ్రీ లీల కృతి శెట్టి లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో బాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సాయి పల్లవి ఒక్క ప్రాజెక్టు కోసం మిగతా అన్ని ప్రాజెక్టులకు దూరంగా ఉంటే కచ్చితంగా అది ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక హీరో తన సినిమా కోసం రెండేళ్ల కేటాయించవచ్చు.
కానీ ఒక హీరోయిన్ ఇలా రెండేళ్ల పాటు డేట్లు కేటాయించడం అనేది ఆమె కెరీర్ కి భారీ రిస్క్ అని అంటున్నారు. ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ. వారికి 30 ఏళ్లుపై పడితే వారితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించరు. సాయి పల్లవి చేస్తున్న రిస్క్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.