నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా నుండి వచ్చిన సారంగదరియా సాంగ్ రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుని టాలీవుడ్ నెం.1 గా నిలిచింది. రౌడీ బేబీ తర్వాత అత్యంత స్పీడ్ గా 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న సారంగదరియా సాంగ్ ఒరిజినల్ గా నాది అంటూ కోమలి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసింది. శేఖర్ కమ్ముల తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చింది.
దాదాపు రెండు వారాల పాటు ఈ వివాదం కొనసాగింది. ఎట్టకేలకు దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించడంతో వివాదంకు తెర పడ్డట్లయ్యింది. కోమలిని ఇటీవల కలిసిన శేఖర్ కమ్మలు తన తదుపరి సినిమాలో తప్పకుండా పాడేందుకు అవకాశం ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. అదే విధంగా రాయల్టీ కింద కొంత మొత్తంను కూడా దర్శకుడు శేఖర్ కమ్ముల ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ వివాదం జరిగిందని శేఖర్ కమ్ముల అన్నాడు. ఇప్పుడు ఈ వివాదం పూర్తిగా సమసి పోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.