సిల్క్ స్మిత మరణం.. ఆ హీరోనే చివరలో..

సిల్క్ స్మిత పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్లకు ఈమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ 80 90ల కాలం వారికి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అప్పట్లో సినిమా కి గ్లామర్ యాడ్ అవ్వాలంటే హీరోయిన్ కాదు సిల్క్ స్మిత ఉండాల్సిందే. చాలా మంది సినిమాని హీరో కోసం హీరోయిన్ కోసం కాదు కేవలం ఆమె కోసమే వెళ్లేవారు.

ఆమె అందం ఆకర్షణ అలాంటిది. ఆమె వాయిస్ కూడా కైపెక్కించేలా ఉంటుంది. అసలు హీరోయిన్స్ కన్నా కూడా క్రేజ్ ఆమెకే ఉండేది. సిల్క్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ మెరిసింది.

ఏ నటి అయినా కొంతకాలం మాత్రమే వెండితెరపై వెలగగలదు. సిల్క్ విషయంలోనూ అదే జరిగింది. సినిమాలో అవకాశాలు తగ్గాయి. దానికితోడు ఆమెకు ఇతర సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాలో ఆమెను పురుషులు ఎంత ఆరాధించినా బయట మాత్రం చాలా తక్కువగా చూసేవారట. కారణం ఏదైనా ఆమె 1996లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణం ఎంతో మందిని బాధించింది.

అయితే ఆమె చనిపోతే చూడటానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరూ వెళ్లలేదట. అలా వెళ్లకపోవడానికి ఆమె చేసిన క్యారెక్టర్లు కూడా కారణం కావచ్చు. నిజానికి వ్యక్తిగతంగా ఆమె చాలా మంచి మనిషట. చనిపోయేనాటికి ఆమె వయసు 35 మాత్రమే కావడం విశేషం. సమస్యలకు ఎదురు నిలపడే వయసు కాకపోవడం అండగా నిలిచేవారు కూడా లేకపోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

అయితే ఆమె అంత్యక్రియలకు ఒకే ఒక్క హీరో హాజరయ్యారు. ఆయనే యాక్షన్ హీరో అర్జున్. ఆయన అలా రావడం పట్ల చాలా మంది చాలా అనుకున్నారు. కానీ ఆయన ఆమె అంత్యక్రియలకు వెళ్లడానికి కూడా కారణం ఉందట. సిల్క్ స్మిత అర్జున్ ని మంచి స్నేహితుడిలా భావించేదట. తాను చనిపోతే చివరిసారి చూడటానికి వస్తావా అని అడిగిందట. అది గుర్తుకు వచ్చి ఆయన ఆమెకు నివాళులర్పించారు. కాగా సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత క్యారెక్టర్ లో విద్యా బాలన్ నటించారు.