సీన్ కోసం బీర్ తాగిన మేటి నాయిక ఆమని!

మూడు దశాబ్ధాల క్రితం రిలీజ్ అయిన ‘జంబలకడి పంబ’ అప్పట్లో ఎత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నరేష్..ఆమని జంటగా ఈ వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన వినోధ భరిత చిత్రమిది. మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని హైలైట్ చేస్తూ రూపొందించారు. ఆడవాళ్ళ పనులు మగవారు.. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో? ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా అనుభవాలని ఆమని ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే…

‘సినిమాలో మద్యం తీసుకునే సన్నివేశాలు… సిగరెట్ కాల్చే సీన్స్ ఉన్నాయని దర్శకుడు ముందు చెప్పలేదు. రోజులాగే షూటింగ్ లొకేషన్ కి వెళ్లాను. మద్యం సీన్ గురించి చెప్పారు .దానికి నేను ఒకే అన్నా. అయితే ఇదంతా నాకు కొత్త.. బాటిల్ లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారేమో అనుకున్నా. కానీ.. రియల్ బీర్ ఇచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తే బయటికి నురుగ పొంగుతుంది.

ఇదేంటని అడిగా …దానికి వాళ్లు బీర్ అన్నారు. ఆ పొంగులోనే నువ్వొక సిప్ చేయాలన్నారు. ఒకే షాట్ అన్నారు డైరెక్టర్. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మా.. తాగు అని ప్రోత్సహించారు. దీంతో తప్పని పరిస్థితులో బీర్ రుచి చూడాల్సి వస్తుంది’ అని అన్నారు.

అప్పుడంటే ఇవన్నీ కొత్త. ఇప్పుడు ఏ సినిమా చేసినా మద్యం..సిగరెట్ తాగని సన్నివేశం అంటూ లేదు. ఇప్పటి సినిమాల్లో చాలా కామన్ గా కనిపించే సన్నివేశాలివి. ఆ మధ్య ఓ సినిమాలో నిత్యామీనన్ వైన్ షాప్ కెళ్లి బీర్ బాటిల్స్ కొన్న సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలిచాయి. మద్యం తాలుకా సంభాషణలకు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తుంది. మద్యం సన్నివేశాలే ఇప్పుడు క్రేజీ సన్నివేశాలుగా మారిపోయాయి.

‘శుభ సంకల్పం’.. ‘శుభ లగ్నం’.. ‘మావి చిగురు’.. ఇలా ఎన్నో క్లాసిక్స్ లో నటించారు మేటి కథానాయిక ఆమని. కె.విశ్వనాథ్ సహా ఎందరో దిగ్గజాలంటి దర్శకులతో పని చేసిన ఆమని పరిశ్రమ అగ్ర నటుల సరసన కథానాయికగా నటించి మెప్పించారు. దశాబ్ధాల కెరీర్ లో అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.