సీరియల్‌ లో అమ్మగా, సోషల్ మీడియాలో అందాల ఆరబోత

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వారి వయసుకు తగ్గ పాత్రలు అస్సలు చేయడం లేదు. ఆరు పదుల వయసు లో ఉన్న హీరోలు మూడు పదుల వయసు వేశాలు వేస్తూ లవ్, రొమాన్స్ అంటున్నారు. ఇక మూడు పదుల వయసు ఉన్న నటీమణులు మాత్రం అయిదు పదుల హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నారు.

వయసు తో సంబంధం లేకుండా చాలా మంది నటిస్తున్నారు అనేందుకు మరో ప్రత్యక్ష సాక్ష్యం జ్యోతి రాయ్‌. తెలుగు సీరియల్‌ గుప్పెడంత మనసు సీరియల్‌ లో జగతి గా జ్యోతి రాయ్ నటిస్తుంది. ఈమె వయసు 38 ఏళ్లు.. అయినా కూడా తల్లి పాత్రలో నటిస్తూ ఉంది. వయసు తో సంబంధం లేకుండా జ్యోతి రాయ్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ సర్ ప్రైజ్‌ చేస్తోంది.

జగతి గా నిండు చీర కట్టు లో కనిపిస్తూ ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాబోయ్‌ ఇంత అందంగా ఈమె ఉంటుందా, ఇంత అందాల ఆరబోత ఈమె చేస్తుందా అని నోరు వెళ్లబెట్టే విధంగా ఉంటాయి. కాస్త గట్టిగా ట్రై చేస్తే హాట్ బ్యూటీగా హీరోయిన్‌ గా లేదా కనీసం ఐటం సాంగ్స్ లో అయినా జ్యోతి రాయ్ ఆఫర్లు దక్కించుకునేంత అందం ఈమెది. అలాంటి ఈ అమ్మడు సీరియల్‌ లో మాత్రం నిండు చీర కట్టు లో కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు చూసి ఇక పై సీరియల్‌ లో ఈమెను అమ్మగా చూడాలంటే ఇబ్బందిగా ఉందని కొందరు రెగ్యులర్ గా కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. కన్నడ సినీ ఇండస్ట్రీ లో పలు సినిమాల్లో నటించడంతో పాటు దాదాపు 20 సీరియల్స్ లో కూడా ఈమె నటించి మెప్పించింది.

నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా కుర్ర కారు మతి పోగొట్టేంత అందాల ఆరబోత ఈ అమ్మడి సొంతం. అందుకే ఈ అమ్మడి అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. సీరియల్‌ నటిగా జ్యోతి రాయ్‌ కి ఉన్న గుర్తింపు తో ముందు ముందు సినిమా ల్లో హాట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏమైనా నటిస్తుందేమో చూడాలి.