సీనియర్ హీరోల్లో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్లతో అదరగొట్టేస్తున్నాడు బాలయ్య బాబు. సినిమా హిట్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా 109వ ప్రాజెక్ట్ పై గురి పెట్టారు. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తోనే వావ్ అనిపించేశారు.
ఇక 110, 111 సినిమాల లెక్క కూడా కుదిరినట్టే అని తెలుస్తుంది. 110 వ సినిమా అఖండ 2 చేయాలని అనుకుంటున్న బాలకృష్ణ 111వ సినిమాను మరోసారి వీర సింహా రెడ్డి కాంబో రిపీట్ చేయాలని చూస్తున్నారు.
గోపీచంద్ మలినేనితో బాలయ్య బాబు మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. అయితే బాలకృష్ణ రీసెంట్ గా భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో ఆదిత్య 999 సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు. అది ఎలా సాధ్యపడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ లో ఒక విచిత్రమైన కాంబినేషన్ వినిపిస్తుంది. బాలకృష్ణ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సుక్కు బాలయ్య బాబుతో సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.
అసలు ఈ కాంబో కుదురుతుందా లేదా అన్నది తెలియదు కానీ నందమూరి ఫ్యాన్స్ కి ఈ ఊహే థ్రిల్ కలిస్తుంది. ఏమో సుకుమార్ కి బాలకృష్ణ ఇమేజ్ కి తగిన కథ ఆలోచన వస్తే ఆయనతో కలిసి చేసినా చేయొచ్చు. మరి బాలయ్య సుకుమార్ ఈ కాంబినేషన్ నిజంగానే జరుగుతుందా లేదా అన్నది చూడాలి.
సుకుమార్ సినిమాల స్టైల్ వేరు.. బాలకృష్ణ సినిమాల పంథా వేరు. కథ క్యారెక్టరైజేషన్ తన సినిమాలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే సుక్కు బాలయ్యతో సినిమా అంటే కచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇది నిజంగా జరుగుతుందా లేదా ఫ్యాన్స్ కోరిక అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ తన నెక్స్ట్ సినిమా అసలైతే విజయ్ దేవరకొండతో చేయాల్సి ఉంది. అది ఉంటుందా మరో సినిమా చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది.