సుకుమార్ శిష్యుడితో నందమూరి హీరో

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులులో అందరి కంటే ముందుగా దర్శకుడిగా పరిచయం అయిన వ్యక్తి పల్నాటి సూర్య ప్రతాప్. అయితే ఈ దర్శకుడు 2009లో “కరెంట్” అనే సినిమా చేశారు. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. తరువాత సుకుమార్ “నేనొక్కడినే” సినిమాకి స్క్రీన్ రైటర్ గా వర్క్ చేశారు. నెక్స్ట్ సుకుమార్ అందించిన “కుమారి 21ఎఫ్” తో రెండో ప్రయత్నంలో దర్శకుడిగా పల్నాటి సూర్య ప్రతాప్ సక్సెస్ అందుకున్నాడు.

ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కింది. తరువాత “రంగస్థలం”, “పుష్ప 1” సినిమాలకి సూర్య ప్రతాప్ సుకుమార్ దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. మరలా “18 పేజెస్” అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కథని సుకుమార్ అందించారు. ఈ మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్న సూర్య ప్రతాప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సారి సొంత కథతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ప్రెజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో దర్శకుడు సూర్య ప్రతాప్ ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. మొదటి సినిమా “కరెంట్” తర్వాత సొంత కథతో దర్శకుడిగా తనని తాను షోకేస్ చేసుకోవడానికి రెడీ అవుతోన్న సూర్య ప్రతాప్ కి ఈ మూవీ ఏ మేరకు బ్రేక్ ఇస్తుందనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో “NKR21” మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ సిద్ధం అవుతోంది. ఈ సినిమాకి మెరుపు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారంట. నవంబర్ లో మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీని తర్వాత బింబిసార2 కూడా కళ్యాణ్ రామ్ చేయనున్నాడు.