సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న దీపికప‌దుకొణే!

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ 170వ సినిమా లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ‘జైభీమ్’ ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన్ వేల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ‘జైల‌ర్’ షూటింగ్ పూర్తిచేసిన ర‌జ‌నీ త్వ‌ర‌లోనే ఈ సినిమా షూట్ లో పాల్గొంటారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తుది ద‌శ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఓ కొలిక్కి రావ‌డంతో హీరోయిన్ ఎంపిక‌పై కొన్ని రోజులుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుస్తోంది. హీరోయిన్ గా ఎవ‌ర్ని ఎంపిక చేయాలి? అన్న అంశంపై ర‌క‌ర‌కాల డిబేట్లు న‌డుస్తున్నాయి.

కోలీవుడ్ న‌టిని తీసుకోవాలా? పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ తీసుకోవాలా? అన్న దానిపై చిత్ర యూనిట్ ఆలోచ‌న చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ర‌జనీకి జోడీగా దీపికా ప‌దుకొణే అయితే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు లీకులందాయి. హీరోయిన్ పాత్ర కూడా సందేశాత్మ‌కం గా ఉంటుందిట‌. ఆ పాత్ర‌కు బాగా పాపుల‌ర్ అయిన న‌టి అయితే ఆ రోల్ జ‌నాల్లోకి బ‌లంగా వెళ్తుంద‌ని భావించి దీపిక‌ని లైన్ లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

ఇది నిజ‌మ‌తే! సినిమా కి దీపిక పెద్ద అస్సెట్ అవుతుంది. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్యారాయ్ న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె రేంజ్ ఉన్న హీరోయిన్ ఎవ‌రూ ర‌జ‌నీతో ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు దీపికా ప‌దుకొణే ఎంట్రీ షురూ అయితే ఆ కోవ‌లోకి దీపిక వ‌చ్చేస్తుంది. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే సౌత్ సినిమాల‌పై కూడా సీరియ‌స్ గా దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ -కె’లో న‌టిస్తోంది.

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం దీపిక చాలా రోజులు కాల్షీట్లు కేటాయించింది. అలాగే అట్లీ దర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న బాలీవుడ్ సినిమా ‘జ‌వాన్’ లోనూ అతిధి పాత్ర పోషిస్తుంది. ఇందులో హీరోయిన్ గా న‌య‌న‌తార న‌టిస్తున్న షారుక్ తో ఉన్న బాండింగ్ కార‌ణంగా దీపిక చిన్న రోల్ చేయ‌డానికి అంగీక‌రించింది. ఇలా దీపిక కొన్ని నెల‌లుగా సౌత్ సినిమాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా త‌లైవార్ 170 లోనూ లాక్ అయితే ప‌దుకొణే పేరు మ‌రింత మారుమ్రోగిపోతుంది.