సౌందర్య మళ్లీ పుట్టిందా.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

సోషల్ మీడియా మంచికి ఎంతో ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే దారి తీస్తుంది. ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్లింగ్స్ ఎదుర్కొని సెలబ్రిటీలు అయిన వారు కొందరు ఉంటే హీరోలకు హీరోయిన్లకు దగ్గర పోలికలతో ఉండి వారి డూపులుగా వారి పాటలకు మాత్రమే అభినయిస్తూ క్రేజ్ తెచ్చుకున్న వారు మరికొందరు. అలా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన సౌందర్యలానే ఉన్న ఒక యువతి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

నిజానికి కన్నడ రాష్ట్రానికి చెందిన సౌందర్య సొంత భాష కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ ఎందరో స్టార్ హీరోల పక్కన నటించిన ఆమె చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయారు.

ఏ మాత్రం అందాల ఆరబోతకు చాన్స్ ఇవ్వకుండా పద్ధతిగా కనిపిస్తూనే స్టార్ హీరోయిన్ గా మారిన సౌందర్య అంటే ఇప్పటికీ చాలా మందికి ఈ నాటికి చాలా ఇష్టం. ఇప్పటికీ ఎంతో మంది ఆమె నా అభిమాన హీరోయిన్ అని చెప్పుకుంటూ ఉంటారు.

అలాంటి సౌందర్యలాగే కనిపిస్తూ ఒక యువతి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది. చూస్తే సౌందర్య మళ్ళీ పుట్టిందా అనిపించే విధంగా ఆమె సౌందర్య పాటలకు మాటలకు సరిగ్గా నప్పే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరినీ మైమరిపిస్తూ వస్తోంది.

అయితే ఆమె అసలు పేరు చిత్ర. మలేషియాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించిన చిత్ర కొంచెం వయసు వచ్చేటప్పటికి తాను సౌందర్యలా ఉన్నాను అనే విషయం అర్థం చేసుకుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడూ ఆమెను అలాగే పిలుస్తూ ఉండేవారు. జూనియర్ సౌందర్య. జూనియర్ సౌందర్య అంటూ ఉండడంతో ఆమె కూడా తనను తాను జూనియర్ సౌందర్యగా భావిస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే టిక్ టాక్ అందుబాటులోకి రావడంతో సౌందర్య పాటలకు ఆమె డైలాగులకు లిప్ సింక్ వీడియోలు చేసి టిక్ టాక్ లో షేర్ చేస్తూ వచ్చేది. వాటికి బీభత్సమైన క్రేజ్ రావడంతో చిత్రాజీ అనే పేరుతో టిక్ టాక్ లో మంచి ఫేమస్ అయిన్దిల్. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత అదే పేరుతో ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి సౌందర్య అభిమానులకు సౌందర్య లేకపోయినా మీ జూనియర్ సౌందర్య ఉందంటూ అలరిస్తూ వస్తోంది.