కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని, ఎన్నో కథలు విని చివరకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యష్ హీరోగా ‘టాక్సిక్’ అనే భారీ సినిమా రూపొందుతోంది.
గీతూ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ను హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.
తాజాగా కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేసిన టామ్ స్టర్తర్స్ ను ఈ సినిమా కోసం తీసుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా భారీ ఎత్తున రూపొందబోతున్న యాక్షన్ సన్నివేశాల కోసం కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగబోతున్నారట.
యష్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లో ది డార్క్ నైట్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన టామ్ స్టర్తర్స్ ‘టాక్సిక్’ సినిమా కు హాలీవుడ్ టచ్చింగ్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా టామ్ స్టర్తర్స్ వ్యవహరించబోతున్నట్లు కన్నడ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటున్నాయి. ఈ టాక్సిక్ కి కూడా హాలీవుడ్ రేంజ్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు.