టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో చేసిన రాజీ పాత్ర తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాలోని ఐటం సాంగ్ తో ఉత్తరాదిన మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
సినిమాలు మరియు సిరీస్ లతో సమంత హిందీ లో బిజీ అవ్వబోతుంది. అనారోగ్య సమస్యల కారణంగా సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నా కానీ.. ఇప్పటికే సినిమాలు మరియు సిరీస్ లు విడుదల అయ్యేవి అనే విషయం తెల్సిందే. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న కారణంగానే ఈ అమ్మడు డబూ రత్నానీ క్యాలెండర్ పై కనిపించే ఛాన్స్ దక్కించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే దక్కిన డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్ ఆఫర్ ఇప్పుడు సమంత దక్కించుకుంది. సమంత బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకోవడం వల్లే ఈ ఆఫర్ వచ్చిందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం సామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తుంది. వరుసగా టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ ఉంది.