సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం. హీరోలు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం.. పెళ్లి వరకు వెళ్లడం ఈ మధ్య తరుచు చూస్తూనే ఉన్నాం. దర్శకుడు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం కూడా మనం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూ ఉన్నాం. తాజాగా యంగ్ హీరో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి సిద్ధం అయ్యాడు.
ఓహ్ మై కడవులే సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న యంగ్ హీరో అశోక్ సెల్వన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీగా ఉన్నాడు. కీర్తి పాండియన్ తో ఈయన పెళ్లి జరుగబోతుంది. సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె ఈ కీర్తి పాండియన్. ఇప్పటికే ఈమె నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించడంతో పాటు మంచి గుర్తింపు దక్కించుకుంది.
గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. వీరి ప్రేమ వ్యవహారంకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ 13న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. పెళ్లి కి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. వీరి పెళ్లి వార్తలు మరియు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అశోక్ సెల్వన్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతున్నాడు. నటుడిగా ఓహ్ మై కడవులే సినిమా తో మంచి మార్కులు దక్కించుకున్న అశోక్ తెలుగు లో కూడా మెల్ల మెల్లగా గుర్తింపు దక్కించుకుంటున్నాడు.
త్వరలోనే ద్వి భాషా చిత్రాలను చేసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కీర్తి పాండియన్ నటిగా కెరీర్ ను కంటిన్యూ చేయడంతో పాటు మంచి కథ లభిస్తే తప్పకుండా అశోక్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.