స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం!

స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం జరిగింది. టాలీవుడ్ లో విభిన్నమైన భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్. ప్రశాంత్ నటించిన ‘లాఠీ’ సినిమాతో దర్శకుడిగా తన విభిన్నమైన పంథాకు శ్రీకారం చుట్టిన గుణశేఖర్ ఆ తరువాత భారీ సెట్ లతో నిర్మించే క్రేజీ ప్రాజెక్ట్ లకు కేయాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇండస్ట్రీ హిట్ లు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

కాకతీయ పట్టపురాణి రుద్రమదేవి వీరోచిత కథ ఆధారంగా ఛారిత్రక నేపథ్యంలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించి ప్రశంసల్ని దక్కించుకున్నారు. అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో అల్లు అర్జున్ రానా నటించారు.

సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న గుణశేఖర్ ప్రస్తుతం సమంత కీలక పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కించారు.

ఆదిపర్వంలోని శకుంతల దుశ్యంతుడి ప్రేమ కావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ ‘శాకుంతలం’ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 3డీ ఫార్మాట్ లో రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ ద్వారా గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా పరిచయం అవుతోంది.

మేకింగ్ విషయంలో తండ్రికి తగ్గ తనయగా మంచి గుర్తింపుని ఇప్పటికే తెచ్చుకున్న నీలిమ గుణ గత రెండేళ్లుగా ‘శాకుంతలం’ నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇదిలా వుంటే శనివారం నీలిమ గుణకు రవి ప్రఖ్యతో నిశ్చతార్థం జరిగింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దర్శకుడు గుణశేఖర్ ఓ ఫొటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.

ఈ రోజు నా పెద్ద కుమార్తె నీలిమ గుణ లగ్న పత్రిక రాయించాం. రవి ప్రఖ్యతో నిలిమ వివాహం జరగనుంది. వీరిద్దరిని శుభాభినందనలు’ అంటూ ఎంగేజ్ మెంట్ ఫోటోని షేర్ చేశారు.