స్టార్ హీరోకు సినిమా చూపించాలని సిద్ధమైన క్రైం బ్రాంచ్


ఓ మలయాళ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి రౌడీలతో లైంగిక దాడి చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోకు సినిమా చూపించడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైలుపాలై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ హీరో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను హత్య చేయడానికి అతడి గెస్ట్ హౌస్ లో బంధువులు స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసు అధికారుల హత్యకు స్కెచ్ వేసిన ఆ హీరో మీద మరో కేసు నమోదు కావడం కలకలం రేపింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవాలని ఆ హీరో అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కోర్టులో ఆ హీరోకు చుక్కెదురు కావడంతో అతడితోపాటు అతడి కుటుంబ సభ్యులు స్నేహితులను మూడు రోజులు విచారణ చేసి పూర్తి సమాచారం బయటకు లాగాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సర్వం చేసుకుంటున్నారు. ఈ కేసులో స్టార్ హీరో పోలీస్ అధికారుల హత్యకు కుట్ర పన్నాడని వెలుగుచూస్తే అతడిపై సీనియస్ యాక్షన్ తప్పదని సీనియర్ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

మలయాళం తమిళం భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి 2017లో కేరళలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని కారులో బయలు దేరింది. మార్గమధ్యలో కారులో వెళుతున్న నటిని కిడ్నాప్ చేసిన కొందరు నిందితులు ఆమె మీద లైంగిక దాడి చేసి వీడియోలు తీశారని అప్పట్లోనే నటి ఫిర్యాదు చేసింది. కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో మలయాళ సినీ రంగంలో టాప్ 5 అగ్రహీరోల్లో ఒకరైన హీరో దిలీప్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న దిలీప్ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.

బెయిల్ మీద బయటకు వచ్చిన హీరో దిలీప్ ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ చేస్తున్న కొందరు పోలీసు అధికారులను హత్య చేయడానికి హీరో దిలీప్ అతడి బంధువులు స్నేహితులతో కుట్ర పన్నాడని ఆరోపణలు వెలుగుచూడడం కలకలం రేపింది.

నటి కేసు విచారణ చేస్తున్న పోలీసులను హత్య చేయడానికి హీరో దిలీప్ 2017 అలువాలోని అతడి ఇంట్లో బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి స్కెచ్ గీశాడని వెలుగుచూసింది. ఈ మేరకు మరో కేసు హీరో దిలీప్ పై నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ఇదే కనుక నిజం అని తేలితే హీరో దిలీప్ తాట తీయాలని కేరళ పోలీసులు రెడీ అవుతున్నారట..