స్టార్ హీరో సినిమా రేంజ్ లో బేబీ ప్రీమియర్స్ బుకింగ్స్..

ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బేబీ. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రోజులో(జూలై 14) వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ట్రైలర్ సినిమా పై బాగా ఆసక్తిని కలిగించాయి. అలానే విజయ్ విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన పాటల కు విశేష స్పందన దక్కింది. దీంతో సినిమా చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతున్న తరుణం లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనుంది. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్ కు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ అందింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రా లోని పలు ప్రాంతాల్లో ఈ ప్రీమియర్స్ వేయనున్నారు. అయితే అన్నీ చోట్లా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలిసింది. ప్రతి షో హౌస్ ఫుల్ కానుందట. దీని బట్టి స్టార్ హీరో సినిమా కు ఉన్న క్రేజ్.. ఈ సినిమా సొంతం చేసుకుందని అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ వల్లే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి.

ఇక ఈ ప్రీమియర్స్ లో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది. అలా ఈ వీకెండ్ ఈ సినిమాదే హవా అవుతుంది. ఇప్పటికే మూడు వారాల క్రితం విడుదలైన సామజవరగమణ కూడా ఇలా ప్రీమియర్స్ ద్వారానే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా ఆడింది. ఇక ఈ బేబీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. వచ్చే రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాదే జోష్.

యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ బేబీ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథాంశంతో రూపొందింది. ఇందు లో ఇన్నోసెంట్ ఆటో డ్రైవర్ గా ఆనంద్ దేవరకొండ నటించగా.. కాలేజ్ స్టూడెంట్ గా విరాజ్ అశ్విన్ కనిపించారు. డీగ్లామర్ విలేజ్ గర్ల్ గా మోడరన్ అమ్మాయి గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వైష్ణవి చైతన్య నటించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాని కి ఎమ్ ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విప్లవ్ ఎడిటర్ గా వ్యవహరించారు.

ఇకపోతే నీలం సాయి రాజేశ్ ఈ చిత్ర దర్శకుడు. హృదయ కాలేయం సినిమా తో పరిచయమయ్యారు. ఆ తర్వాత కొబ్బరి మట్ట చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘కలర్ ఫోటో’కు పనిచేశారు. ఇప్పుడు ‘బేబీ’ చిత్రం తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు.