ప్రముఖ స్టార్ హీరో స్నేహితుడు.. వ్యాపారవేత్త అయిన అతడి సంపదలు, కంపెనీ టర్నోవర్ ఎప్పుడూ చర్చనీయాంశమే. రూ.4,130కోట్ల విలువ చేసే కంపెనీని అతడు నడిపిస్తున్నాడు. భారత్, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపార కార్యకలాపాలను కలిగి ఉన్న మెహతా గ్రూప్ అనే బహుళజాతి కంపెనీని నడుపుతున్నాడు. ఇంతకీ ఎవరు అతడు అంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ స్నేహితుడు జే మెహతా. భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో ఒకరిగా ఆయన పరిగణనలో ఉన్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దేశంలోని అగ్ర నటుల్లో ఒకరిగా సినీరంగాన్ని ఏల్తుంటే జే మెహతా తాను ఎంచుకున్న వ్యాపార రంగంలో టైకూన్ గా వెలిగిపోతున్నారు. అయితే కింగ్ ఖాన్ షారూఖ్ కేవలం నటుడిగానే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్త అనేది చాలామందికి తెలియదు. షారుఖ్ ఖాన్ అనేక వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. చాలా వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)లో షారుఖ్ ఖాన్ కీలక పెట్టుబడులలో ఒకటి. KKR జట్టుకు షారూఖ్ ఖాన్, అతడి `డర్` సహనటి, స్నేహితురాలు జూహీ చావ్లా, వ్యాపారవేత్త అయిన ఆమె భర్త జే మెహతా సహ-యజమానిగా ఉన్నారు.
జే మెహతా భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయన మెహతా గ్రూప్ అనే బహుళజాతి కంపెనీని నడుపుతున్నాడు. మెహతా గ్రూప్ ఆఫ్రికా, ఇండియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా విస్తరించి ఉంది. దేశవిదేశాల్లో సత్తా చాటుతున్న సంస్థ ఇది. ది మెహతా గ్రూప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ సుమారు USD 500 మిలియన్ల ఆస్తులను నియంత్రిస్తుంది. మెహతా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మెహతా భారతదేశంలో మరో రెండు కంపెనీలను రన్ చేస్తున్నారు. సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్, గుజరాత్ సిద్ధీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీలను దేశీయంగా రన్ చేస్తున్నారు.
18 జనవరి 1961న జన్మించిన జే మెహతా మహేంద్ర మెహతా -సునయన మెహతా దంపతుల కుమారుడు. జే మెహతా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్విట్జర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ నుండి MBA చేసారు. జై మెహతా 1995లో బాలీవుడ్ సూపర్ స్టార్ జుహీ చావ్లాను రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జాహ్నవి అనే కుమార్తె , అర్జున్ అనే కుమారుడు ఉన్నారు. జాహ్నవి మెహతా 2001లో, అర్జున్ మెహతా 2003లో జన్మించారు.