సీనియర్ నటీమణులు రాధిక-రాధ-విజయశాంతి-శ్రీదేవి .. వీరంతా ఎవరికి వారు ప్రత్యేక నటసామర్థ్యంతో దశాబ్ధాల పాటు పరిశ్రమను ఏలారు. అయితే వీరంతా మెగాస్టార్ చిరంజీవి సరసనా నటించారు. అయితే వీళ్లలో ఎవరిని మెగాస్టార్ ఎక్కువగా ఇష్టపడతారు? అంటే దానికి సరైన సమాధానం చిరునే ఇచ్చారు.
తాజాగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తన కథానాయికల గురించి ప్రత్యేకంగా వర్ణించారు. ఈ సందర్భంగా శ్రీదేవితో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించే ప్రత్యేక అనుభవం అని చిరంజీవి వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి-ఎస్పీ పరశురామ్-మోసగాడు చిత్రాలలో చిరు-శ్రీదేవి జంటగా నటించారు.
తన నాయికల్లో ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేకత ఉంది. యూనిక్ క్వాలిటీతో అలరించే ప్రతిభావంతులే. సౌలభ్యం స్పాంటేనిటీలో రాధిక చాలా ప్రత్యేకం. డ్యాన్స్ స్కిల్స్ లో రాధ యూనిక్.. తన పాత్రలో తనను తాను మార్చుకునే గొప్పతనం విజయశాంతి సొంతం… అని తెలిపారు.
అనంతరం శ్రీదేవి గురించి మాట్లాడుతూ తన డ్యాన్స్ నటన చూడటం మరచిపోలేని అనుభూతి అని… అతిలోక సుందరి మేటి నర్తకి అని తనతో కలిసి డ్యాన్సులు చేసినంతగా మరెవరితోనూ చేయలేదని అన్నారు. దివంగత శ్రీదేవి ప్రస్తుతం స్వర్గలోక అధిరోహకులు. ఇంద్రుని కుమార్తె మెగాస్టార్ మాటలు వినే ఉంటారు.
అక్కడ తన ఆనందాన్ని వ్యక్తం చేసి ఉంటారు! పాప్ స్టార్ స్మిత హోస్టింగ్ చేస్తున్న ‘నిజం విత్ స్మిత’ షో ప్రోమోలు వీడియోలు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టాప్ సెలబ్రిటీల చిట్ చాట్ లతో స్మిత షో ఆదరణ దక్కించుకుంటుందనడంలో సందేహం లేదు.