హాలీవుడ్ ని కూడా సమంత అలా మాయ చేస్తుందా?

చెన్నై బ్యూటీ సమంత టాలీవుడ్ లో ఆడియన్స్ ని ఎలా మాయ చేసిందో తెలిసిందే. నాగచతైన్యతో కలిసి `ఏ మాయ చేసావే` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి హృదయాల్లో నిలిచిపోయింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు నాట పాపులర్ అయింది. కుర్ర కారులో ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. విడాకుల సంగతి పక్కనబెడితే! చైతన్యతో వివాహం అభిమానుల్ని ఎంతో సంతోషపెట్టింది. రెండు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.

తాజాగా బాలీవుడ్..హాలీవుడ్ అంటూ కొత్త జర్నీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఓ వైపు హిదీలో బిజీ అయ్యే ప్లాన్ వర్కౌట్ చేస్తూనే హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకోవాలని చూస్తుంది. ఇప్పటికే `చెన్నై స్టోరీ` అనే సినిమా చేస్తుంది. దీన్ని తమిళ్..ఇంగ్లీష్ భాషల్లో రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా చెన్నైస్టోరీనే కాదు..చెన్నై అమెరికా లవ్ స్టోరీ అని లీకైంది. ఇది ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అని తెలిసింది. తమిళ్-ఇంగ్లీష్ లో చేయడం వెనుక స్టోరీ ప్లాట్ మెయిన్ రీజన్ గా తెలుస్తుంది.

తాజాగా చెన్నై స్టోరీకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి లీకైంది. ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమాలో హీరో లండన్ కు చెందిన అబ్బాయి అట. హీరోయిన్ సమంత చెన్నైకి చెందిన అమ్మాయి అట. ఇద్దరి మధ్య ఓ అందమైన ప్రేమ కథని డిజైన్ చేసినట్లు లీకులందుతున్నాయి.

ఇది ఎంతో నేచురల్ గా ఉంటుందిట. కేవలం తమిళ్ మాత్రమే తెలిసిన అమ్మాయి అమెరికా వెళ్లి అక్కడ లండన్ కి చెందిన ఇంగ్లీష్ యువకుడితో ప్రేమలో పడితే! ఆ జర్నీ ఎలా సాగింది అన్నది ఆసక్తికరంగా మలుస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో సమంత పాత్రని చాలా నేచురల్ గా డిజైన్ చేసారుట. సినిమాలో ఓ రిలీజియన్ ని కూడా హైలైట్ చేస్తున్నారుట. ఈ కథలో హీరో వేరే మతానికి చెందిన వాడుట. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. హాలీవుడ్ ని కూడా చెన్నై బ్యూటీ తనదైన ప్రేమ చూపించి మాయ చేయడం పక్కా అనిపిస్తుంది.