అడివి శేష్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘హిట్ 2’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్’కు ఫ్రాంచైజీగా శైలైష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించి ప్రేక్షకుల్లో భారీ బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తో మంచి ఆదరణ ని సొంతం చేసుకుంటోంది.
బ్యాక్ టు బ్యాక్ హిట్ లని సొంతం చేసుకుంటూ వస్తున్న అడివి శేష్ ఈ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హీరో నాని కూడా ఈ మూవీతో నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్ంకిన ఈ మూవీలో అడివి శేష్ తనదైన నటనతో కెడీ పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని తొలి రోజే సొంతం చేసుకన్న ఈ మూవీ తొలి రోజు మంచి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టం గురించి మేకర్స్ టెన్షన్ పడ్డారు. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలోని కీ హైలైట్ సైకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు నెటిజన్ లు లీక్ చేస్తే ఇలాంటి సినిమాలకు అదే పెద్ద మైపస్ గా మారుతూ వుంటుంది.
ఆ కారణంగా అసలు సీక్రెట్ బయటపడటంతో ప్రేక్షకులు ఈ మూవీ థియేటర్ కు వచ్చి చూసేందుకు ఆసక్తిని చూపించరు.
ఈ విషయాన్ని ముందే గ్రమించిన హిట్ 2 టీమ్ హీరో అడివి శేష్ హీరో నాని సైకో ని సోషల్ మీడియా వేదికగా ఎక్కడా రివీల్ చేయకూడదని అభ్యర్థించారు. అది చాలా వరకు ఉపయోగపడింది. హంతకుడు ఎవరు?.. ఎలా వుంటాడు? .. తను హత్యలు ఎందుకు చేస్తాడనే విషయాల్ని రివీల్ కానివ్వకుండా ‘హిట్ 2’ టీమ్ కు నెటిజన్ లు సహకరించారు.
దీంతో ‘హిట్ 2’ టీమ్ ఊపరి పీల్చుకుందని తెలుస్తోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి కొనసాగింపుగా రానున్న ‘హిట్ 3’లో నేచురల్ స్టార్ నాని నటించబోతున్న విషయం తెలిసిందే.