బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు కొత్తేం కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో బెదిరింపులు చూసారు. కానీ రెండేళ్లగా ఆయనకొస్తున్న బెదిరింపులు మాత్రం ఆషామాషీ మాదు. పబ్లిక్ గానే చంపేస్తామంటూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఎన్నోసార్లు బెదిరింపు లేఖలు..ఈమెయిల్స్ వచ్చాయి. జైల్లో ఉండే? తన మనుషుల ద్వారా రకరకాల చర్యలకు లారెన్స్ పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇలా గతేడాదంతా సల్మాన్ బెదింరుపులు ఎదుర్కూంటూనే ఉన్నాడు. ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. అయినా బెదిరింపులు మాత్రం ఆగలేదు. తాజాగా సల్మాన్ ఇంటి దగ్గర అలజడి కనిపిస్తోంది. అభిమనం పేరుతో ఇద్దరు వ్యక్తులు హీరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసారు. దీంతో అక్కడ ఇప్పుడంతా టెన్షన్ వాతావరణం నెలకుంది.
ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు? కానీ ఎటు వైపు నుంచి ఎలాంటి దాడి జరుగుతోంది? అన్న సన్నివేశం అయితే సల్మాన్ పరిసరాల్లో కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే ముంబైకి సమీపంలో పాన్వెల్ ప్రాంతంలో సల్మాన్ కి ఓ ఫామ్ హౌస్ ఉంది. అక్కడికి తరుచూ వెళ్తుంటాడాయన. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇద్దరు వ్యక్తులు అందులోకి చొరబడే ప్రయత్నం చేసారు.
సెక్యూరుటీ వారిచింనా వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరి వద్ద నకిలీ ఐడెంటిటీ కార్డులు ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వాళ్లు ఎందుకు వచ్చార? లారెన్స్ మనుషులా? కొత్త గ్యాంగ్ ? ఇలా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజా సన్నివేశం నేపథ్యంలో సల్మాన్ కి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.