హీరోయిన్‌ కాకుండానే బాల నటిగా రూ.10 కోట్లు!

సారా అర్జున్‌.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని పాత్ర యుక్త వయసు లో ఉన్నప్పుడు సారా అర్జున్‌ పోషించింది.

ఇన్నాళ్లు బాల నటిగా సారా ను చూసిన ప్రేక్షకులు యుక్త వయసు నందిని పాత్రలో చూసి అవాక్కయ్యారు. బాబోయ్ ఇంత మార్పా అంటూ నోరు వెళ్లబెట్టారు. ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్‌ దొరినట్లే అంటూ మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఒక వైపు బాల నటిగా నటిస్తూనే మరో వైపు హీరోయిన్‌ పాత్ర లకు సిద్దం అవుతున్న సారా అర్జున్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు బాల నటిగా సారా అర్జున్ ఏకంగా రూ.10 కోట్ల సంపాదన కలిగి ఉందట. సాధారణంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతటి సంపాదన దక్కించుకోగలుగుతారు. కానీ సారా అర్జున్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకుండానే తన సంపాదన ను ఏకంగా రూ.10 కోట్లకు తీసుకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ముందు ముందు కచ్చితంగా తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో సారా అర్జున్ కు హీరోయిన్‌ పాత్రల్లో నటించే అవకాశాలు వస్తాయి. అదే కనుక జరిగితే ఆమె సంపాదన రూ.10 కోట్ల నుంచి వంద కోట్లకు చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి సారా అర్జున్‌ తన పాత్రలతో మాత్రమే కాకుండా తన సంపాదన తో కూడా వార్తల్లో నిలవడం విశేషం.