టీవీ సీరియల్ యాంకర్ గా మొదలైన మంగ్లీ ప్రయాణం ఇప్పుడు హీరోయిన్ స్థాయికి చేరడం విశేషం.తెలగాణ యాసలో పాటు పాడుతూ పాపులర్ అయిన మంగ్లీ అనతి కాలంలోనే పాపులర్ అయింది. సినీ గాయనిగా మారి ఎంత మంది శ్రోతలకు ఫేవరేట్ సింగర్ గా మారి ప్రత్యేకతను సంతరించుకుంది. చిత్తూరు జిల్లా సుంకిడికి చెందిన సత్యవతి రాథోడ్ కాస్త తెలంగాణలో మంగ్లీగా మారి తెలంగాణ మాండలికంలో ఫోక్ సాంగ్ లు పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది.
నాగచైతన్య నటించిన `శైలజా రెడ్డి అల్లుడు` సినిమాతో సినీ నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. తనదైన మార్కు గొంతుతో మెస్మరైజ్ చేస్తూ వస్తున్న మంగ్లీ తనకంటూ గాయనిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. జానపద గాయనిగా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ ఆ తరువాత టెలివిజన్ ప్రజెంటర్గా నటిగా మారి మంచి మార్కులే కొట్టేసింది. స్వేచ్ఛ గువ్వా గోరింక మాస్ట్రో వంటి సినిమాల్లో నటించింది.
తను గొంతు విప్పిందంటే ఆ పాట సూపర్ హిట్టే అనేంతగా టాలీవుడ్ శాండల్ వుడ్ లలో మంచి పేరు తెచ్చుకుంది. గాయనిగా తెలుగు తమిళ కన్నడ భాషల్లో క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ సెమీ పాన్ ఇండియా సింగర్ అనిపించుకుంటున్న మంగ్లీ త్వరలో హీరోయిన్ గా నటించనుందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. కన్నడ సినిమాతో మంగ్లీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కన్నడ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్వకత్వం వహిస్తున్న కన్నడ సినిమా `పాదరాయ`ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుందని చెబుతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో మంగ్లీ పాన్ ఇండియా హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2013-14 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఇందులో నాగశేఖర్ హీరోగా నటిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ ని త్వరలోనే ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.