అవికా గోర్ ప్రధాన పాత్రలో కృష్ణ భట్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది ఆర్ట్’. సరైన అవకాశాల కోసం చూస్తున్న సమయం లో అవికాకి వచ్చిన గ్రేట్ చాన్స్ ఇది. ఇప్పటికే అమ్మడికి కెరీర్ టాలీవుడ్ చరమాంకదశలో ఉంది.
ఈ నేపథ్యంలో హిందీ సినిమా లో ఛాన్స్ రావడం..అది తెలుగు లోనూ రిలీజ్ అవ్వడంతో అవికా గోర్ పేరు మళ్లీ వినిపిస్తుంది. ఈ సినిమాకి మహేష్ భట్ కథ అందించడంతో పాటు నిర్మాణం లోనూ భాగమవుతున్నారు. విక్రమ్ భట్ తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రచారం కోసం మేకర్స్ కింగ్ నాగార్జునని రంగం లోకి దించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ ని ఆయన చేతుల మీదుగానే లాంచ్ చేసారు. అనంతరం సినిమా ని ఉద్దేశించి కింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయమేస్తుంది. కానీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు నన్నొక నిశబ్దం అవహించినట్లు అయింది. నిజంగా భయపడ్డాను. అందుకే దాన్ని పొగొట్టుకోవడానికి నవ్వాను’ అని అన్నారు.
ఇటీవలి కాలం లో హిందీ సినిమాల్ని ప్రమోట్ చేయడానికి టాలీవుడ్ టాప్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రిలీజ్ ల్లో భాగంగా ఒకరి సినిమాల్ని మరొకరు ప్రమోట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ లో భాగంగా ఇలా ప్రచారానికి సహకరిస్తున్నారు. గతంలో ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాని నాగార్జున..చిరంజీవి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని అమీర్ ఖాన్ హిందీ లో ప్రమోట్ చేసారు.
ఇక సల్మాన్ ఖాన్…సంజయ్ దత్ లాంటి వారు సౌత్ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి సినిమాల్లో గెస్ట్ అప్పిరయన్స్ ఇస్తున్నారు. సల్మాన్ గాడ్ ఫాదర్ లో నటించడం..సంజయ్ దత్ ‘కేజీఎఫ్-2’ లో నటించడం తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సహా మరో తెలుగు సినిమా లో విలన్ పాత్ర పోషిస్తున్నారు.