ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే అక్కడ కేవలం బూతు సినిమాలు వచ్చేవేమో అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ గా నిలుస్తూ… సినిమాలన్నీ రీమేక్ చేస్తున్నారంటే అక్కడ సినిమాల స్టాండర్డ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ కు అది చిన్న పరిశ్రమ అయినా అక్కడ వస్తున్న క్వాలిటీ కంటెంట్ తమిళ కన్నడ తెలుగులో కూడా రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు.
ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లు కొట్టేస్తున్నారు మలయాళ మేకర్స్. తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో ఒక చిన్న సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే కాదు. ఒక రకంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఆ సినిమా పేరు రోమన్ చామ్. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నాన్ స్టాప్ నవ్వించడంతో సూపర్ సక్సెస్ సాధించేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలా అయితే చిన్న సినిమాగా జాతి రత్నాలు సినిమా రిలీజ్ బంపర్ హిట్ అందుకుందో ఈ సినిమా కూడా అదే విధంగా దూసుకుపోవడం గమనార్హం.
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలైన ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తూ దుమ్ము రేపుతూ దూసుకుపోతోంది. వాస్తవానికి పెద్ద పెద్ద హీరోల నటించే సినిమాలు కూడా అక్కడ ఫ్లాప్ అయిన సమయంలోనే ఈ సినిమా హిట్టు కొట్టడమే కాదు. కేరళలో ఇప్పటివరకు 34 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా అయితే 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా తెరకెక్కించడానికి 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్న ఇప్పటికీ ఎక్కడా కలెక్షన్స్ విషయంలో వెనకడుగు వేయకుండా 60 కోట్ల గ్రాస్ మార్కు వైపు దూసుకుపోతోంది అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీలలో సినిమాలు కొనుక్కుంటున్న సంస్థలన్నీ వాటి స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కుని ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.