20 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకునేలా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మట్క. గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. కొంతకాలంగా సరైన సక్సెస్ లు లేని వరుణ్ తేజ్ మట్కా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఈ సినిమా విషయంలో గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఆయన కాన్ఫిడెన్స్ చూసి అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు.

నితిన్ తో ద్రోణ సినిమా తీసి ఆ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి పలాస 1978 సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించారు కరుణ కుమార్. ఐతే ఆ తర్వాత సినిమాలు చేసినా అంతగా సక్సెస్ అందుకోలేదు. కానీ మట్కా విషయంలో లెక్క తప్పదని చెబుతున్నారు కరుణ కుమార్. తనకు సెట్ లో స్టార్ హీరోలుగా ఉండే నటులను హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఐతే వరుణ్ తేజ్ మాత్రం తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి అందరితో సరదాగా ఉన్నారు. పలాస సినిమాలో ఎంత ప్రశాంతంగా వర్క్ చేశానో మట్కా అప్పుడు కూడా అంతే హాయిగా చేశానని అన్నారు.

మట్కాలో వరుణ్ తేజ్ నటన గురించి చెబుతూ ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్స్ కి చిరంజీవి గారి గెటప్స్ లను రిఫరెన్స్ గా తీసుకున్నాం. సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా బాగా కష్టపడ్డారు. 20 ఏళ్ల తర్వాత కూడా మట్కా లో వరుణ్ తేజ్ నటన గురించి చెప్పుకుంటారని అన్నారు కరుణ కుమార్. ఇక ఈ సినిమా తీసేందుకు నిర్మాతలు విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి ఎంతో సహకరించారని చెప్పారు కరుణ కుమార్. ఈ సినిమా కథ గురించి చెబుతూ.. బర్మా నుంచి వైజాగ్ కు శరణార్ధిగా వచ్చిన వాసు కథే ఈ మట్కా సినిమా. రతన్ ఖత్రి జీవితంతో ఈ సినిమా చేయలేదు.

రతన్ కత్రి ఏం చేశాడనే ఆలోచనతో ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని చెప్పారు కరుణ కుమార్. అంతేకాదు మట్కా ఆట కూడా ఎంతో క్లారిటీగా చూపించామని అన్నారు. జివి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని అన్నారు. ఇక సినిమా అనేది బిజినెస్ విత్ ఆర్ట్ లాంటిది.. తనతో చేసిన నిర్మాతలు ఎప్పుడు లాభపడాలని నేను కోరుతాను. అందుకే షూటింగ్ టైం లో ఎక్కువ ఫుటేజ్ ని తీయనని అన్నారు కరుణ కుమార్. ప్రతి సినిమాలో తన మార్క్ ఫిల్మ్ మేకింగ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయా లేదా అని చూస్తాను. అలా లేని రోజు తాను సినిమాలు తీయడం మానేస్తానని చెప్పారు కరుణ కుమార్.