కొత్త సంవత్సర వేడుకల కోసం టాలీవుడ్.. బాలీవుడ్ జంటలు ప్రస్తుతం విదేశీ విహారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం వరకూ ఫారిన్ ట్రిప్ లో కుటుంబ సమేతంగా ఆస్వాధించేందుకు భారీ ప్రణాళికలను కలిగి ఉన్నారు. ఇప్పటికే పలువురు కపుల్స్ బీచ్ విహారయాత్రలను ఆస్వాధిస్తున్నారు.
ఇంతకుముందే పటౌడీ సంస్థానాధీశురాలు బెబో కరీనాకపూర్ ఖాన్ న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వెబ్ లోకి వచ్చాయి.కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం కరీనా కపూర్ ప్రిపరేషన్ తన అభిమానుల్లో చర్చకు వచ్చింది. కరీనా ఈ పార్టీ కోసం ప్రత్యేకించి రూ.2 లక్షల ఖరీదైన సీక్విన్ గౌన్ ను ఎంపిక చేసుకుంది. ఈ గౌన్ లో రారాణి కరీనా మెరుపులు కళ్లు తిప్పుకోనివ్వని ట్రీట్ గురించి ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.
బెబో ఎక్కడ ఉన్నా సంథింగ్ స్పెషల్. తాను అన్నివేళలా యూనిక్ ఎంపికలతో షో స్టాపర్ గా నిలుస్తుంది. విదేశాలకు విహారయాత్రకు వెళ్లినా…బీచ్ పార్టీలకు హాజరైనా… ప్రియమైన సన్నిహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నా… రెడ్ కార్పెట్ ఈవెంట్ లకు హాజరైనా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకునే సాయంత్రాన్ని ఆస్వాధించినా… కరీనా ఫ్యాషన్ సెన్స్ నిరంతరం హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఈవెంట్ ఏదైనా బెబో హాజరైతే అక్కడ కళ్లన్నీ తనపై వాలిపోవాల్సిందే. అంతగా షో స్టాపర్ గా నిలుస్తుంది.
కరీనా తన నూతన సంవత్సర వేడుకల్లో ఫ్యాషన్ సెన్స్ గురించి ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా నయా లుక్ తో మెరుపులు మెరిపించింది. ఈ పార్టీలో సైఫ్ అలీ ఖాన్ ..కరీనా పిల్లలు తైమూర్ .. జహంగీర్ (జెహ్)తో కలిసి నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యారు. అందమైన సీక్విన్ గౌనులో కరీనా తళుకుబెళుకుల ముందు ఇంకెవరూ ఈ పార్టీలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా 31 నైట్ వేడుకల నుండి సైఫ్ అలీ ఖాన్- తైమూర్- జెహ్ లతో తాను కలిసి ఉన్న రకరకాల ఫోటోలను బెబో షేర్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కరీనా థై స్లిట్ సీక్విన్డ్ గ్రీన్ గౌనులో హై-ఎండ్ గ్లామర్ తో తళుకుబెళుకులు ప్రదర్శించింది. డిజైనర్ లేబుల్ ఎలీ సాబ్ షెల్ఫ్ ల నుండి రూపొందించిన ప్రత్యేక ఎంపిక ఇది.
కరీనా దుస్తుల ధర ఎంత?కరీనా ఎమరాల్డ్ గ్రీన్ గౌను ఎలీ సాబ్ ఫాల్ 2022 కలెక్షన్ నుండి ఎంపిక చేసుకున్నది. దీనిని లారెల్ గ్రీన్ స్ట్రిప్డ్ సీక్విన్ డ్రెస్ అని పిలుస్తారు. ఈ డ్రెస్ ఖరీదు రూ.2.5 లక్షలు (USD 2850) అని తెలుస్తోంది. ఈ గౌన్ ప్రత్యేకత ను పరిశీలిస్తే… పొడవాటి డ్రెస్ లో డెకోలేటేజ్ స్టైల్ V నెక్ లైన్ – బిల్లింగ్ ఫుల్-లెంగ్త్ డాల్మన్ స్లీవ్స్.. సిన్చ్డ్ వెస్ట్ లైన్ – రిలాక్స్డ్ సిల్హౌట్ లతో ఆకర్షణీయమైన సైడ్ స్లిట్ – ఫ్లోర్-మేజింగ్ హేమ్ వర్క్.. ఫిగర్-స్కిమ్మింగ్ ఫిట్టింగ్ ఇలా డిజైనర్లు చాలా శ్రమించాకే ఇది రూపొందింది.
కాంబినేషన్ గా ఇయర్ స్టడ్స్- డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్.. మ్యాచింగ్ రింగ్ లు.. బ్లాక్ క్లచ్ బ్యాగ్ .. డిజైనర్ హైహీల్స్ సహా అద్భుతమైన ఉపకరణాలతో కరీనా సీక్విన్డ్ దుస్తులలో మెరుపులు మెరిపించింది. ఆ సొగసైన కేశాలంకరణ.. స్మోకీ ఐ షాడో.. పింక్ లిప్ షేడ్.. గ్లోయింగ్ స్కిన్ మేకప్ తో గ్లామర్ హద్దులు చెరపేసింది. ప్రస్తుతం కరీనా గౌన్ పార్టీ క్రౌడ్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. కరీనా కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాల్లో నటించేందుకు సంతకాల ప్రక్రియలో ఉన్నారని సమాచారం.