సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాకి పండగ అని చెప్పాలి. ఆ సీజన్ లో రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా మినిమం బాగుంది అనే టాక్ వచ్చిన కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి. ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో స్టార్ హీరోల చిత్రాలని ఆ సమయంలో రిలీజ్ చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగులో వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇక వాల్తేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. వీరసింహారెడ్డి మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న నిర్మాతకి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక తమిళం నుంచి వచ్చిన వారసుడు మూవీకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎవరు పోటీ పడే అవకాశాలు ఉన్నాయనే విషయంపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. అయితే 2024 సంక్రాంతిలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్ సి 15 మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే శంకర్ ఇండియన్ 2 రిలీజ్ చేసిన తర్వాత రామ్ చరణ్ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ దర్శకత్వంలో 99వ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ స్టార్ట్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇక రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో అప్పుడే పోటీకి రెడీ అయిపోతున్నాయి. మరి వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.
మరి వీటిలో ఏది ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది అనేది వేచి చూడాలి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి డేట్ కి రిలీజ్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.