హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ఏల్తోంది. పీసీ నటించిన సిటాడెల్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంది. మరోవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలను నిర్మించేందుకు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించే సన్నాహకాల్లో ఉన్నారు పీసీ. ప్రియాంక చోప్రా ప్రస్తుతం వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేదు! గ్లోబల్ స్టార్ గా అనేక సూపర్-హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా ఆసక్తికరమైన అంతర్జాతీయ ప్రాజెక్టులలో కూడా భాగమైంది. తదుపరి రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో కనిపించనుంది. ఇందులో రిచర్డ్ మాడెన్ ఒక కీలక పాత్రధారి.
ప్రియాంక కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు. తనో గొప్ప రచయిత్రి.. వ్యవస్థాపకురాలు వ్యాపారవేత్త కూడా. ఇటీవల UK-ఆధారిత బ్యూటీ కంపారిజన్ ప్లాట్ ఫారమ్ కాస్మెటిఫై రీసెర్చ్ ఆధారంగా.. ఇటీవలి వార్షిక ఆదాయం ఆధారంగా 2023 సంపన్న సెలబ్రిటీ బ్యూటీ బ్రాండ్ ల జాబితాను షేర్ చేసింది. ప్రియాంకచోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ రిహన్న కాస్మెటిక్ బ్రాండ్ తర్వాత జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ 2023 రెండవ సంపన్న సెలెబ్ బ్యూటీ. 2023 సంపన్న సెలబ్రిటీ బ్యూటీ బ్రాండ్ ల కాస్మెటిఫై జాబితాలో 477.2 మిలియన్ పౌండ్లతో రిహన్న ఫెంటీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ 429.9 మిలియన్ పౌండ్ల(4843 కోట్లు)తో జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
కైలీ జెన్నర్ కాస్మెటిక్ బ్రాండ్ 301.4 మిలియన్ పౌండ్ల ఆదాయంతో జాబితాలో మూడవ స్థానంలో ఉంది. అరియానా గ్రాండే బ్యూటీ బ్రాండ్ 70.3 మిలియన్ పౌండ్లతో నాలుగవ స్థానంలో ఉంది. సెలీనా గోమెజ్ రేర్ బ్యూటీ 50.2 మిలియన్ పౌండ్ల ఆదాయంతో జాబితాలో ఐదవ స్థానాన్ని సంపాదించింది.
ప్రియాంక యొక్క హెయిర్ కేర్ బ్రాండ్ గత సంవత్సరం (2022)లో ప్రారంభమైంది. వ్యాపార రంగంలోకి ప్రవేశించడంపై వోగ్ ఇండియాతో పీసీ మాట్లాడుతూ-”నేను ఇటీవల బ్యూటీ ఉత్పత్తులు.. అలాగే వినోద పరిశ్రమ రెండింటి వ్యాపారాలపై దృష్టి సారించాను.. స్టైలిస్ట్ కుర్చీలో కూర్చోవడం.. అనేక ఉత్పత్తులను మేకప్ కోసం ఉపయోగించడం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది నిజంగా విభజించేలా చేసింది.
నిజానికి నా జుట్టులోకి వెళ్లే ఉత్పత్తుల గురించి చెప్పడానికి చాలా సమయం అవసరం” అని తన బిజినెస్ లాజిక్ ని వెల్లడించింది. ప్రియాంక చోప్రా తదుపరి స్ట్రీమింగుకు సిద్ధంగా ఉన్న సిరీస్ సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇది ఏప్రిల్ 28న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది.