టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని. ఇప్పటి వరకు రామ్ హీరోగా కమర్షియల్ ఎంటర్టైన్ కథలతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే మిగిలిన స్టార్ హీరోల తరహాలోనే తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రామ్ యాక్షన్ చిత్రాలతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.
అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేదు. ఇదిలా ఉంటే ఈ సారి ఏకంగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటిని పట్టుకున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ పోతినేనిని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వీరిద్దరి కలయికలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ చిత్రం రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే బోయపాటి సక్సెస్ ఫార్ములా అయిన డ్యూయల్ ని ఈ సినిమా కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తుంది.
సినిమాలో రామ్ రెండు భిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. అందులో ఒకటి 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని చాలా పవర్ ఫుల్ గా బోయపాటి రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్స్ లో రామ్ తండ్రి పాత్రలో 50 ఏళ్ళ వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. ఈ పాత్ర చాలా ఎఫెక్టివ్ గా కథని మరో లెవల్ కి తీసుకొని వెళ్ళేలా ఉంటుందని సమాచారం.
ఈ నేపధ్యంలో రామ్ పోతినేని కూడా ఈ 50 ఏళ్ళ వ్యక్తి పాత్రని చాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నాడని తెలుస్తుంది. కచ్చితంగా ఈ పాత్ర అభిమానులకి సర్ప్రైజ్ గా ఉంటుందని రామ్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తూ ఉండగా దీనిపై ఈ కుర్ర హీరో కూడా భారీగానే హోప్స్ పెట్టుకున్నాడు అని తెలుస్తుంది.