50కి చేరువలో ఉన్నా మలైకా అరోరాఖాన్ టీనేజీ మెరుపులు యువతరంలో హాట్ డిబేట్ గా మారుతున్నాయి. ఓవైపు యువహీరో అర్జున్ కపూర్ తో మలైకా ప్రేమాయణం నిరంతరం ముంబై మీడియాలో వేడెక్కిస్తూనే ఉంది. మరోవైపు ఫ్యాషన్ షోలు.. సినిమా ఈవెంట్లు.. విదేశీ షికార్లు.. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ వగైరా వగైరా వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
అయితే ఈ ఏజ్ లోనూ మలైకా అంత ఫిట్ గా ఉండేందుకు కారణమేంటో తన ఇన్ స్టా.. సోషల్ మీడియాని పరిశీలిస్తే అర్థమవుతుంది. అక్కడ రెగ్యులర్ గా ఫిట్ నెస్ కోసం మలైకా ఎంతగా శ్రమిస్తుందో ఫోటోలు-వీడియో ఆధారాలకు కొదవేమీ లేదు. 49లోనూ 16 ప్రాయం ఎలా సాధ్యం? అనేందుకు మలైకా పెర్ఫెక్ట్ ఫిట్ నెస్ మంత్ర ఓ కారణం అని అర్థమవుతుంది.
తాజాగా అమ్మడు సెగులు పుట్టించే ఫోటోతో నెట్టంట వైరల్ గా మారింది. నిగనిగలాడే అమ్మడి థై షో ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంటుంది. పారదర్శక వస్త్రధారణ హైలైట్. వివిధ భంగిమల్లో అమ్మడి హాట్ ఫోజులకు కుర్రాళ్లకు మతి పోవాల్సిందే. 49 ఏళ్ళ వయసులోనూ పరిపూర్ణమైన ఫిట్ నెస్ తో ఆకట్టుకోవడం మలైకాకే చెల్లింది.
పాదాలకు ఎత్తైన మడమలు అర్బన్ చిక్ లుక్‌కి మరింత వైభవాన్ని తీసుకొచ్చాయి. సన్నని వల లాంటి దుస్తుల్లో టాప్ టూ బాటమ్ ఓ రేంజ్లో హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఎద అందాల ఆరబోత అగ్గిరాజేస్తుంది.
డిజైన్ పై ఎంపిక చేసుకున్నయాక్సరసీస్ మరింత అందంగా మలిచాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రంట్‌లో మలైకా టీవీ కార్యక్రమాలు ఇతర వినోద కార్యక్రమాలతో బిజీగా ఉంది. అమ్మడు దేశవ్యాప్తంగా అనేక టెలివిజన్ షోలకు జ్యూరీగా కూడా కొనసాగుతుంది. ప్రపంచ వేదికలపైనా మెరుపులు మురిపిస్తుంది. కానీ బాలీవుడ్ లో కెరీర్ పుంజుకోవడం మాత్రం ఇబ్బంది కరంగానే కనిపిస్తుంది.