ఈమధ్య కాలంలో చిన్న స్టార్స్ కూడా పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ నయతార మాత్రం కమర్షియల్ యాడ్స్ కి చాలా అరుదుగా ఓకే చెబుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా కమర్షియల్ యాడ్స్ కి నో చెబుతూ వచ్చిన నయనతార ఎట్టకేలకు ఒక యాడ్ కి ఓకే చెప్పింది.
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా నయనతార ఒక కమర్షియల్ యాడ్స్ లో నటించేందుకు ఓకే చెప్పింది. కేవలం 50 సెకన్ల యాడ్ లో కనిపించేందుకు గాను ఏకంగా రూ.5 కోట్ల పారితోషికంను అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఏడాది పాటు ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ లో నయనతార ఫోటోలు మరియు వీడియోల్లో నయనతార కనిపించబోతుంది. యాడ్ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండియన్ భాషల్లో అన్నింట కూడా మంచి క్రేజ్ ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
నయనతార తో యాడ్ చేస్తే అది తమిళం, తెలుగు మరియు మలయాళ, కన్నడ భాషల్లో కూడా ప్రసారం చేయవచ్చు. అందుకే అయిదు కోట్ల పారితోషికంను ఇచ్చి మరీ నటింపజేసినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే తెలుగు లో ఈ అమ్మడు ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.