జిగేల్‌మనిపించే అందంతో, అచ్చ తెలుగు లుక్స్‌తో బుల్లితెరని ఏలేస్తోన్న అనసూయ టీవీ యాంకర్‌గానే హీరోయిన్లతో సమానమైన పాపులారిటీ తెచ్చుకుంది. అనసూయకి ఆన్‌లైన్‌లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా అబ్బుర పడాల్సిందే. సమంత, తమన్నాల గురించి రాసిన వార్తలకి కూడా రానన్ని హిట్స్ అనసూయ అనే కీ వర్డ్‌కి వస్తాయంటే ఆమెకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
అందుకే అనసూయ పాపులారిటీని వాడుకునేందుకు ఇప్పుడామెతో సినిమా కూడా తీస్తున్నారు. మేకప్‌తో తళ తళ మెరిసిపోయే అనసూయ అసలు మేకప్పే లేకపోయినా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె తీసుకున్న ఈ సెల్ఫీలోనే చూడండి… మేకప్ లేకుండానే ఎంత ప్లెజెంట్‌గా ఉందో?