టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ చిత్రాల దర్శకుడిగా గుణ శేఖర్ కు పేరుంది. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ చిత్రాల కోసం ఆయన వేసిన సెట్టింగ్స్ అప్పట్లో సంచలనం. తెలుగులో సెట్స్ ప్రస్తుతం ఈ స్థాయిలో పెరిగి పోవడంకు కారణం ఆయనే అనడంలో సందేహం లేదు. అప్పట్లోనే కోట్లు పెట్టి సెట్టింగ్స్ ను వేయించిన ఘనత గుణ శేఖర్ కు దక్కింది. రుద్రమ దేవి చిత్రం తర్వాత గుణశేఖర్ ఇప్పటి వరకు తదుపరి చిత్రంను మొదలు పెట్టలేదు.
గుణశేఖర్ విడుదలైన సమయంలో ప్రతాపరుద్రుడు సినిమాను చేస్తానంటూ ప్రకటించిన గుణశేఖర్ ఆ తర్వాత రానాతో ‘హిరణ్యకశిప’ చిత్రం చేస్తానంటూ ప్రకటించాడు. సురేష్ బాబు ప్రముఖ హాలీవుడ్ బ్యానర్ తో కలిసి హిరణ్య కశిప చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సినిమా గురించి కనీసం ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్లుగా అనిపించడం లేదు.
ఎప్పుడు చూసినా అదుగో ఇదుగో అంటున్నారు తప్ప అసలు విషయాన్ని చెప్పడం లేదు. దర్శకుడు గుణశేఖర్ ఇటీవల కూడా మీడియాతో మాట్లాడుతూ హిరణ్య కశిప చిత్రం ఆగిపోలేదని వర్క్ జరుగుతుందని అంటున్నాడు. అయితే గుణశేఖర్ ఈ మాట చెప్పడం ఇదే ప్రథమం కాదు. గత మూడు సంవత్సరాలుగా ఇదే ముచ్చట చెబుతున్నాడు. దాంతో ప్రేక్షకుల్లో అసలు హిరణ్య కశిప చిత్రంపైనే ఆసక్తి పోయింది.
ఈ ఏడాదిలో కరోనా కారణంగా ఎలాగూ మొదలు కాదు. వచ్చే ఏడాది మరేదో కారణంతో ఖచ్చితంగా ఆ తదుపరి సంవత్సరంకు వాయిదా వేసే అవకాశం ఉందంటూ నెటిజన్స్ గుణశేఖర్‌పై అసహనంతో కామెంట్స్ చేస్తున్నారు. రుద్రమదేవి సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు దాటినా ఇంకా సినిమాను చేయకపోవడంను గుణశేఖర్ తప్పిదంగా విమర్శలు వస్తున్నాయి.