రౌడీ స్టార్‌ అష్టాచమ్మ ఆడనున్నాడా?

విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ మరియు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాతో తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా కథ దర్శకుల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విజయ్‌ దేవరకొండ వచ్చే ఏడాది ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి చిత్రాల గురించి విజయ్‌ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

విజయ్‌ దేవరకొండ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూరితో మూవీ వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నాం. షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. పూరి చిత్రం తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను మైత్రి మూవీస్‌ మేకర్స్‌లో చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ మూవీ ఉంటుందట.

అష్టాచమ్మ చిత్రం తర్వాత వరుసగా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తాజాగా ‘వి’ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమా విడుదలకు రెడీగా ఉంది. నాని విలన్‌గా సుధీర్‌బాబు హీరోగా నటించిన ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన తర్వాత విజయ్‌ దేవరకొండతో ఈయన సినిమాను చేయబోతున్నాడట. దిల్‌రాజు వీరిద్దరి కాంబో మూవీని నిర్మించబోతున్నాడు.