ఆర్ఆర్ఆర్- రామ్ చరణ్ హైలైట్ బ్లాక్ రివీల్ చేసిన ఫైట్ మాస్టర్


దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుషితం’. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర టీం అంతా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన రామరాజు పాత్ర టీజర్ పెద్ద సెన్సేషన్ అయ్యింది.

అందులో రామ్ చరణ్ బాణం, బందూక్ మరియు బాక్సింగ్ లో ఆరితేరుతున్నవాడిలా షాట్స్ ఉన్నాయి. కానీ దాని వెనకున్న కథ మనకు తెలియదు. తాజాగా ఈ చిత్రానికి యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేసిన కుల్దీప్ రివీల్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్ లో బాక్సింగ్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవినేనే డిజైన్ చేసి, కంపోజ్ చేసాను. స్క్రీన్ మీద రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. రాజమౌళి గారి సినిమా చేయడం ఎంత సంతోషంగా ఉందో అంతే గర్వంగా కూడా ఉందని’ కుల్దీప్ తెలిపాడు.

ఎన్.టి.ఆర్ బర్త్ డే (మే 20)కి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలా అని ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం కుస్తీ పడుతున్నారు. అజయ్ దేవగన్, అలియా భట్, సముద్ర ఖని, ఒలీవ మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.